పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

19

ఈ సూత్రము ఆశ్వలాయనుల బ్రహ్మయజ్ఞమునందు ఆచార్యతర్పణప్రకరణములోనిది. ఇందు భారత మహా భారతశబ్దములు వినబడుటచే మహాభారతమునకు అనేకర్తృత్వమును కల్పింప నుద్యమించు వారలకు ఇది కల్పవృక్షముగా గన్పట్టినది, అందుచే క్రమికాన్వయము నూహించి వైశంపాయనునకును, భారతమునకును, కరృత్యసంబంధము నెట్లో కల్పించిరి. కాని యీ సూత్రమందే వారి యన్వయ ప్రకారము పైలస్థానమునకు వచ్చిన మహాభారతమును సౌతి కంటగట్టుటకు జంకు గాని, సూత్రాంతమందున్న ధర్మాచార్యపదమునకు కర్తృత్వార్థము లేదనెడి యాలోచనకాని కలుగకుండుట చిత్రమే! మఱియు "వేదా నధ్యాపయమాస" అను పూర్యోక్తశ్లోకములలో నేసుమంత్వాదులు గ్రహింపబడిరో వారే యీయాశ్వలాయన సూత్రములో గూడ గ్రహింపబడియుండ ప్రతివాదు లీసూత్రములో సుమన్తు జైమిని వైశంపాయన పైలులకు యథాక్రమముగా సూత్రభాష్య భారత మహాభారతము లనబడు గ్రంథములకు కర్తృత్వమును కల్పించి ' వేదా నధ్యా పయామాస' అన్నపుడు ఆసుమంత్వాదు లందరు భారతములనే చేసినారని చెప్పుటలో విరోధము స్ఫురింపకుండుటయు చిత్రమే!

అది యటుండనిచ్చి యీయశ్వలాయన సూత్రమునకు ప్రమాణాంతరసమ్మతమగు నర్థము గ్రహింతము.

————♦♦ దేవీ భాగవతము-స్కం.11, అ.20 ♦♦————

"సుమన్తు జైమినీ వైశంపాయనః పైలసూత్రయుక్ |
 భాష్యభారతపూర్వశ్చ మహా భారత ఇత్యపి |
 ధర్మాచార్యా ఇమే సర్వే తృప్యన్త్వితిచ కీర్తయేత్ ||"

ఇది ప్రతివాదు లుదహరించిన ఆశ్వలాయనసూత్రమునకు శ్లోకరూపమైన వివరణము.ఇచ్చట 'పైలసూత్రయుక్' అనునపుడు