పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

11

థము విరోధములకు ప్రసక్తి లేకుండునట్లు ఉదార హృదయుడగు మహర్షిచే రచింపబడినది. వేదపర్వతమునుండి యవతరించి కుతర్కతరువుల నున్మూలించెడి వ్యాసవాక్యజలప్రవాహముచే భూమియందు రజస్సు అంతరింపజేయబడినది. యీక్షార్ణవేద మను మహాహ్రదము మధురశబ్దము లను మహాహంసములు, మహోపాఖ్యానము లను పద్మములు విస్తృతకథ లను జలము కలిగి యున్నది అని తాత్పర్యము.

దీనిచే నుపాఖ్యానసహితమగు మహాభారతము వ్యాసప్రణీతమేయనియు, భారతమహాభారతనామములు కలది యొక్క గ్రంథమే యనియు, నందు విరోధము లేమియు లేవనియు, అది సకలశాస్త్ర సంప్రదాయసమన్వితమై యున్న దనియు తేలినది.


———♦ సూతసంహిత అ.1 ♦———


“వ్యస్తవేదతయా వ్యాస ఇది లోకే శ్రుతో మునిః|
అయం సాక్షాన్మహా యోగీ వ్యాస స్సర్వజ్ఞ ఈశ్వరః ||
మహాభారత మాశ్చర్యం నిర్మమే భగవాన్ గురుః |"


———♦ విష్ణుపురాణము - అ.3. ♦———


"కృష్ణ ద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణ ప్రభుమ్|
కో హ్మన్యః పుండరీకాక్షా న్మహా భారతకృద్భవేత్||


———♦ దేవీ భాగవతము - అ.3. ♦———


“అష్టాదశ పురాణాని కృత్వా సత్యవతీసుతః|
భారతాఖ్యాన మతులం చక్రే తదుపబృంహితమ్ ||"


———♦ పద్మపురాణము - సృష్టి ఖండము. అ.1. ♦———


మతిమంథాన మావిధ్య యేనాస్మా ఛ్చ్రుతిసాగరాత్ |