పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

మహాభారతతత్త్వ కథనము

భూషణానాంచ సర్వేషాం యథా చూడామణి ర్వరః||

యథాయుధానాం కులిశ మింద్రియాణాం యథా మనః|
తధేహ సర్వశాస్త్రాణాం మహా భారత ముత్తమమ్||

అత్రార్థశ్చైవ ధర్మశ్చ కామో మోక్షశ్చ వర్ణ్య తే|
పరస్పరానుబన్ధాశ్చ సానుబంధాశ్చ తే పృథక్ ||

ధర్మశాస్త్ర మిదం శ్రేష్ఠ మర్థశాస్త్ర మిదం పరమ్ |
కామశాస్త్ర మిదం చాగ్య్రం మోక్ష శాస్త్రం తథోత్తమమ్ ||

చతురాశ్రమధర్మాణా మాచారస్థితిసాధనమ్|
ప్రోక్త మేత న్మహాభాగ వేదవ్యాసేన ధీమతా||

తథా తాతకృతం హ్యేత ద్వ్యాసే నోదారకర్మణా|
యథా వ్యాప్తం మహాశాస్త్రం విరోధై ర్నాభిభూచుతే||

వ్యాసవాక్యజలౌఘేన కుతర్కతరుహారిణా|
వేదశైలవతీర్ణేన నీరజస్కా మహీ కృతా||

కలశబ్దమహాహాంసం మహాఖ్యానపరాంబుజమ్ |
కథావిస్తీర్ణసలిలం క్షార్ణం వేదం మహాహ్రదమ్||

తదిదం భారతాఖ్యానం బహ్వర్థ శ్రుతివిస్తరమ్|
తత్త్వతో జ్ఞాతుకామో౽హం భగవం స్త్వా ముపస్థితః|| "

తపస్స్వాధ్యాయనిరతుడగు మార్కండేయమహర్షిని వ్యాసశిష్యుడు, మహా తేజశ్శాలియునగు జైమినిముని సమీపించి యిట్లనెను. మహర్షీ ! వ్యాసప్రోక్తమగు భారతాఖ్యానము పరిశుద్ధములగు శాస్త్రసముచ్చయములతో పూరింపబడియున్నది. పూర్వపక్ష సిద్ధాంతశోభితమై, సర్వశాస్త్రసారమైయీమహాభారత మొప్పుచున్నది. దీనియందు ధర్మార్థకామమోక్షములు వేర్వేరుగను, వరస్పరానుబంధముగను వర్ణింపబడుటచే నిది ధర్మశాస్త్రము, అర్థశాస్త్రము, కామశాస్త్రము, మోక్షశాస్త్రము నైయున్నది. చతురాశ్రమధర్మసాధనమైన యీగ్రం