పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనేక కర్తృత్వ నిరాకరణము

9

పాఠకులారా! ఈయాశ్రమవాసికపర్వవృత్తాంతముచే మన వ్యాసమహర్షి యొక్క అనితరసాధారణతఃప్రభావము మనకు స్పష్టమైనది. ఈమహనీయుడే మన మహాభారతేతిహాసకర్త. కనుక నీమహాభారతము తెలిసినదికొంత; తెలియనిదికొంత; వినినదికొంత; కనినదికొంత కల్పించినదికొంతయు జేర్చి గ్రంథప్రతిపాద్యవ్యక్తులకు స్వభావవిరుద్దాంశములగూర్చి చర్మచక్షుస్సులచే గ్రహించి మలినాంతఃకరణములచే నూహించి ధర్మసేతువుల నుల్లంఘించి ధనసంగ్రహేచ్ఛతో నధునాతనులచే రచింపబడెడి క్షుద్రగ్రంథములవంటిది కాక యోగబలము, తపశ్శక్తి, దివ్యదృష్టి, యనుపరికరముతో, కాలాంతరదేశాంతరవస్తుసాక్షాత్కారముతో, తత్తద్వ్యక్తిహృదయగ్రహణముతో, వివిధవేదార్థపరిష్కరణముతో, యథార్థేతివృత్తముతో, లోకానుగ్రహేచ్చతో, రచింపబడిన దీపవిత్రగ్రంథ మని యీగంధకర్తృప్రభావమును గ్రంథస్వభావమును స్పష్టముగా గ్రహించితిమి.

——————♦ గ్రంథాంతరస్థమహాభారతప్రశంస ♦——————

ఇక మహాభారతమంతయు వ్యాసమహర్షిప్రణీతమే అనువిషయము గ్రంథాంతరసంవాదముతోగూడ గ్రహింతము.

——————♦ మార్కండేయపురాణము, అl. ♦——————

"తపస్స్వాధ్యాయనిరతం మార్కండేయం మహామునిమ్।
వ్యాసశిష్యో మహాతేజా జైమినిః పర్యపృచ్ఛత॥

భగవన్! భారతాఖ్యానం వ్యాసే నోక్తం మహాత్మనా।
పూర్ణమన్తమలై శ్శుభ్రై ర్నానాశాస్త్రసముచ్చయైః॥
 
జాతిశుద్ధసమాయుక్తం సాధుశబ్దోపశోభితమ్।
పూర్వపక్షోక్తిసిద్ధాన్తపరినిష్ఠాసమన్వితమ్॥

త్రిదశానాం యథావిష్ణు ర్ద్విపదాం బ్రాహ్మణో యథా।