పుట:మహాభారతతత్త్వ కథనము - ప్రథమ భాగము.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

మహాభారతతత్త్వ కథనము

గా 'యుద్దమందు మరణించిన వారిని జూడగోరిక కల'దని తెలిపినంత నే నాటి రాత్రియందు మహర్షి గంగాజలమం దవగాహనము చేసి యాహ్వానింప కురుపాండవపక్షములలోనివా రందఱు యథాపూర్వముగా స్వీయాభరణాయుధవాహనాదులతో గంగాజలమునుండి యావిర్బవించి తీరము జేరగా మహర్షిచే గటాక్షింపబడిన దివ్యదృష్టిచే ధృతరాష్ట్రుడు అందఱతో ప్రసంగించుచు నా రాత్రి మంతయు గడపెను. (ఈగాధా విశేషము ముందు, వేదవ్యాసనిందా నిరాకరణఘట్టములో విపులముగా తెలుపబడును)

ఇట్లీ వృత్తాంతమును వైశంపాయనుడు చెప్పగా వినుచుండిన జనమేజయునకు "ఇట్లుండునా?" అని సందేహము కలిగి వైశంపాయనునితో నిట్లనెను.

"మమాపి వరదో వ్యాసో దర్శయే త్పితరం యది|
తద్రూప వేషవయసం శ్రద్ధధ్యాం సర్వ మేవ తత్ ||
ప్రసాదా దృషి ముఖ్యస్య మమ కామ స్సమృధ్య తామ్|"

వరదుడగు వ్యాసమహర్షి నాకుగూడ నాతండ్రిని ఆరూపవేషవయస్సులతో జూపునేని దానినంతను నేను విశ్వసింతును. ఋషిముఖ్యుని కటాక్షమున నాకోరిక యీడేరుగాక.

అనుచు తన యుత్కటేచ్చను వెల్లడించునంతలో వేద వ్యాస మహర్షి ప్రత్యక్షమై అట్లే పరీక్షిత్తును కనుపఱుపగా__

“తత స్తద్రూపవయస మాగతం సృపతిం దివః|
శ్రీ మన్తం పితరం రాజా దదర్శ స పరీక్షతమ్!"

తాను కోరినట్లే యుండి స్వర్గమునుండి వచ్చి ప్రత్యక్షమైన తండ్రియగు పరీక్షిత్తును జనమేజయుడు సందర్శించెను.