పుట:భీమేశ్వరపురాణము.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70 శ్రీ భీమేశ్వరపురాణము

మూలమంత్రకారణపాంచభూతికవ్యవహారా! నిర్మల జ్యోతిర్లింగమయమంగళాకారా! జయజయ సప్తపాతాళభువనవిష్కంభనిర్భేధనసమాసాదితావిర్భావభావజసంహారా! సర్వమంగళాకుచకలశపాళికేళీతూలికాకారమకరికాముద్రికాభీమముద్రితోరః ప్రదేశమహేశ! జయజయ భక్తభావనాసులభస్వభాననాతీతపావనాకారదావళ్యవిగ్రహా! శ్రీమన్మహాదేవ! దేవదేవతారాధ్య! దక్షవాటీపురాధ్యక్షా! ఆపద్ధ్వాంతదివాకరా! పరమదయాకరా! జయజుయ శ్రీభీమేశ్వరా! నమస్తే నమస్తే నమః. 212

మ. అనుచుం దాండవ మాడుచుండి శివభక్త్యావేశలీలార్భటి
న్మునిశార్దూలము దక్షవాటినడుమన్లోలజ్జాభాగుఁడై
వినిపించెన్ నశరీరభారతి నభోవీథీవిటంకంబునన్
నిను రక్షించెను భీమనాయకుఁడు కానీనా! సుఖం బుండుమీ. 213

తే. కాచె నీతప్పుకల్మషకంధరుండు, శిశిరకరిశేఖరుండు రక్షించె నిన్ను
భీమనాథుని ద్రిభువనస్వామిఁ గొలుము, కార్యసంసిద్ధి, బొందెదు కానినేయ. 214

వ. అని యివ్విధంబున నశరీరవాణి పలికిన విని యయ్యంతర్వాణి శర్వాణీవల్లభుం దలంచి పునఃపునః ప్రణామంబులు చేసి నితాంతసంతోషతరంగితాంతరంగుండై. 215

సీ. పైల! దక్షారామపతి భీమనాథుండు, మనపాలి కల్పకక్ష్మాజ మయ్యె
నో సుమంతుఁడ! దక్షిణోద్యానవాటికా, నిలయుండు మన పాలి ఫలము సువ్వె
జైమినీ! దేవతాసార్వభౌముఁడు విరూ, పాక్షుండు ప్రత్యక్షమయ్యెఁ జువ్వె
దేవల! సప్తగోదావరితీరైక, వాసుండు మనవంక వ్రాలెఁ జువ్వె
తే. భారతాదిబహుగ్రంధపారవశ్య, యోయిజనమేజయుండ! యీయుక్షగమనుఁ
డంబికాభర్త యఖిలకళ్యాణములును, మనకుఁ గృపసేయగలఁడు సమ్మదముతోడ. 216

వ. ఇంకఁ గృతార్థుల మైతి మని శిష్యవర్గంబునుం దానును దక్షారామంబున నభిరామం బైన పరమజ్ఞానానందసుఖం బనుభవించుచుండె. 217

క. శ్రీరామాయణమును ద, క్షారామాయణముఁ గలిమిలాపహములు స
త్సారమతులు వాల్మీకికిఁ, బారాశర్యునకు వినుతిపాత్రము లయ్యెన్. 218

వ. అని చెప్పిన విని యభినందించుటయు భీమేశ్వరమాహాత్మ్యంబు వినువేడుకం బరమేశ్వరుం డుద్భవించిన విధంబును సప్తఋషులు సప్తగోదావరంబుఁ దెచ్చిన విధంబును నాస్వామిని బ్రతిష్ఠ చేసిన భంగియు, నెఱింగించవే యని ప్రార్థించిన. 219

శా. గాంధర్వోపనిషన్మతంగ రసవత్కావ్యానుసారానుధౌ
రంధర్యాపరభోజరాజ రమణీ ప్రద్యుమ్న దోర్వీర్యగ
ర్వాంధారాతివరూధినీపరివృఢ ప్రాణానిలాహారవా
తాంధక్రూరకృపాణ రాజహితకార్యారంభపారంగతా. 220