పుట:భీమేశ్వరపురాణము.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 69

లోహితా! యహరహోవధిసంధ్యాసమయారంభంబుల నుద్దేశదినావసానంబుల నానందంబుగాఁ బరిఢవించు జగఝంకారంబైన యారభటితాండవసముద్దండపాదభ్రమణవిభ్రముంబునఁ ద్రిభువనభయంకరంబు గావించితి; సర్వజా! నిర్వికల్పంబు నిరస్తసమస్తోపాధికంబును సత్యజ్ఞానానందంబునకు నికేతనంబును నగు నిష్కళంకస్వరూపం బగువేదానువచనశాంతదాంతిక్షాంతిశ్రవణనిధిధ్యాసనాదు లగుసాధనంబుల నిర్ణిరోధనిరవగాఢనిరవబోధకక్ష్యావిభాగంబునం దక్షీభవించి ముముక్షులు లాభలక్ష్యంబును నభీక్షణంబును నభీప్సితంబును ననుభవింతురు; భర్గా! భార్గవభృంగ్వంగీరసప్రధాననానామునిసమూహవిహితచరితాఘమర్షణస్నానాహ్నికౌఘయు నిజజలావగాహాపహనిఖిలాఘయు జాహ్నవీసపత్నియు నగుగోదావరీమహానది నీకుం గేలీవిహారం బగుకేళాకూళి; నిటలనయనా! గిటగిటని నడుగునడుగు నడుఁకునడుములు, వెణఁద లగుతెలికన్నులును నెఱికురులును, వలుదకుచములును గలిగి ననవిల్తునకుఁ బసగలపసిండి మెఱుంగు ములుకులనం గలికిచిలుకలకొలుకులగుబిసరుహదళనయనలు ముసురుకుని బలిసి నిలిచి కొలువఁ బ్రతిసంక్రమణవారోత్సవాదులయందుఁ బేరోలగం బవధరింతువు; శర్వా! నీవు శర్వరీసార్వభౌము నొక్కహజ్జున గుజ్జురూపంబున మట్టితివి; సుమశరమథనా! బిసరుహభవుని కిసలయోష్ఠి నాసికాతిలప్రమానంబు నఖశిఖరాగ్రంబున మొదలంటం జిదిమితి; వృషభధ్వజా! నీవు పూషుండనుపేరి రవిపండ్లు రాల గుద్దితి; యీశ్వరా! నీవు వైశ్వానరుని సప్తజిహ్వాపల్లసంబులు పెల్లగిల గిల్లితి; విరూపాక్షా! నీవు దక్షప్రజాపతికంఠంబున మేషంబుతల నిల్పితివి; మృగవ్యాధా! నీ వధ్వరమృగంబు మస్తకంబు నభస్తలంబున వ్రేలంగట్టితి; ముక్కంటీ! నీకు మ్రొక్కెదను; శివా! నీకు నవాంజలి; భవా! నీకు నభివాదంబు; పాండురంగా! నీకు దండంబు; రాజశేఖరా! నీకు జేజే; హరా! నీకు జోహారు; గిరీశా! నీకు వరవస్య; యష్టమూర్తీ! నీకుఁ బ్రతిష్ఠ; యీశానా! నీకు దాస్యంబు; త్రిపురహరా! నీ కుపాసన; మృడా! నీకు శరణు; మృత్యుంజయా! నీకుఁ బ్రపత్తి; ప్రమథాధిపా! నీకు నారాధనంబు; పినాకీ! నీకు నమస్కారంబు; కైలాసనిలయా! నీకుఁ గోపులు; పశ్యల్లలాటా! నీకు నేటికోళ్ళు; గౌరీమనోహరా! నీకు సమస్కారంబు; జయజయ జలంధరాంతకా! గంధసింధురాదిదనుజకంధరాపీఠధమనీగళితరక్తధారాభిషిక్తప్రచండఖండపరశుభిండివాలశూలప్రముఖబహువిధప్రహరణపరంపరాభీలమహాకారా! జయజయ జగత్సంభారకుంభకల్పనాకుంభకారా! కుంభీనసభూషణభీషణభూతప్రేతపిశాచశాకినీఢాకినీప్రౌఢపరీవారా! జయజయ వియద్వాయుధరణీతరణిశీతభానుబృహద్భానుసలిలయజమానమూర్తికల్పితాష్టభేదప్రపంచిత విశ్వప్రపంచపంచవదనపంచాక్షరీ