68 శ్రీ భీమేశ్వరపురాణము
సీ. గరళకూటనీలకంఠాయశంభవే, మదనాంతకాయోన్నమశ్శివాయ
కాద్రివేయాధిపగ్రైయభూషాయ, మధుభిత్సఖాయోన్నమశ్శివాయ
కుంభినీధరసుతాకుచకుంభపరిరంభ, మహలోలుపాయోన్నమశ్శివాయ
వేదాదినిశ్శేషవిద్యావధూమౌళి, మణికపలాయోన్నమశ్శివాయ
తే. గంధదంతావళజరలరాంధకారి, విబుధపరిపంథావాహినీనిబిడవర్గ
బంధఘోరాంధకారసంభారకిరణ, మాలినేశాశ్వతాయోన్నమశ్శివాయ. 211
వ. ఓం జయజయ దేవదేవ గంధర్వసిద్ధవిద్యాధరిచారణకిన్నరకి పురుషు లహంపూర్వికాసంఫుల్లపుటంబు లగుచేతస్సంపుటంబులం బుటబుట నగుభక్తివిశేషంబులు శేషాహికటకభూషావిశేషాభిరామంబు లగుమీ కోమలశ్రీపాదకిసలయంబుల ఘసృణమణికోటీర కోటీవిటంక సందానితమందారమాలికామకరందబిందుధారాధోరణీ ప్రవాహంబుల నహరహంబును నభిషేకింతురు; కంఠేకాలా! మీకంఠమూలంబునం గలువదండకైవడిం గనుపట్టు కరాళకాలకూటవిషమషీకళంకపంగచ్ఛాయుచ్ఛటాగుళుచ్ఛంబుల వలన నిఖలలోకసంరక్షణంబు నిగమవ్యాఖ్యాతంబు; మహానటా! మీజటాజూటపటలంబున డిగిన వియద్గంగానిర్ఝరస్తోత్రశ్శలాకానికాయంబులఁ ద్రిలోకీకంఠోపకంఠంబులు తారహారావల్లీమతల్లిభంగి నంగీకరించు; శంకరా! నీవు సంకర్షణరుద్రావతారంబునఁ బాతాళగోళంబు వెడలి విషదహనవిస్ఫులింగవికటదంష్ట్రాటంకకిటకిటత్కారఘోరంబును జిహ్మలంబును నగువదనగహ్వరంబునఁ బుండరీకభవాంకపిండంబు లొండొండనణంగఁ గవిసి మ్రింగుదు; ధూర్జటీ! విలయపర్జన్యగర్జాడంబరంబున విడంబించు కహకహాట్టహాసంబునన్ బిట్టుధట్టించి యవష్టంభభారదుర్వారగర్వారంభసముజ్జృంభితుం డగుజంభారిభుజార్గళవిజృభణంబు హస్తధృతదంభోళితోడ నస్తంభించితి; దనదనఖా! నిఖిలకకుభవధిపరిధివలయంబులఁ గలయఁ గనత్కనకనఖశలాకానికాయచ్ఛాయాదాయాదంబు లగుసముజ్జ్వలజ్వలాజాలంబులు విజృంభింప ననలస్తంభదివ్యలింగాకారంబున నావిర్భవించి నిలువుభూభువన చక్రవాళపర్యంతం బాక్రమించి పెరిఁగినప్పుడు విరించి రాయంచయుఁ గైటభారి కిటియును నై యెగసి యుడిగియును దుద మొదలు దెలియరైరి; రుద్రా! నీవు భద్రదేవద్రుమాటవీవాటియందు దిసమొలదూఁబఱదిండిమిండజంగంబవై ఋషులపుణ్యాంగనల యీలువు లపాంగరంగస్థలీలాస్యలంపటంబు లగుకటాక్షవీక్షణంబుల హరించుచు భిక్షాటనక్రీడను నటించితి; చండీశ్వరా! నీవు మేరుకోదండంబునఁ బుండరీకాక్షకాండంబు దొడిగి కుండలిజ్వాలావల్లరీఝల్లరీఝంకారంబునఁ బంకరువాభవాండంబు బీఁటగిల్ల నిశాటపుట భేదనంబు లొక్కయేటున ఛటచ్చట నేసితివి; నీల