పుట:భీమేశ్వరపురాణము.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 65

నీవు పత్నీసహితంబుగా నేవలనైన నుండి తపంబు సేయుము. నేనును విశ్వనాథవిరచితావమానభేదంబు వాయ నీస్వామిని సేవించెద నని పలికి సముచితప్రకారంబున నమ్మహాత్ముని వీడు కొలిపి యనంతరంబ శిష్యులుం దానును. 189

వ్యాసుఁడు భీమేశ్వరార్చనంబు సలుపుట

సీ. పంచతీర్థము లాడి భవలింగసన్నిధిఁ, బ్రాసాదపంచాక్షరము జపించి
సొరిది నల్ దిక్కుల సోమేశ్వరములందు, భక్తిఁ బ్రదక్షిణం బాచరించి
కుక్కుటేశ్వరుకేళకూళి నుద్భవమైన, మణికర్ణిక నొనర్చి మజ్జనంబు
నోంకారపురత్రికూటోదరస్థితులైన, హరిహరబ్రహ్మల నభినుతించి
తే. తుల్యగోదావరీనదిఁ దోయనిధిని, సప్తగోదావరంబున స్నానమాడి
యాచరించు శివార్చనం బనుదినంబు, దక్షవాటిక నుండి సత్యవతిసుతుఁడు. 190

క. భీమేశ్వరమహిమంబున, నామోదము నోలలాడుచు నుండున్
భీమేశ్వరచరణారుణ, తామరసంబులకు సంతతముఁ బ్రణమిల్లున్. 191

సీ. మాతృగర్భాకారజాతఖేదము వాయ, హరునిగర్భాగార మాశ్రయించుఁ
బరమేశ్వరార్చనాపరత నించుక తన్ను, నత్యంతధన్యుఁగా నాత్మఁదలఁచు
హర్షించి హరశివత్ర్యంబకాచలగర్భ, భవయంచు రోమాంచపటలిఁ దాల్చుఁ
గరతాళకలన శంకరగీతములు నాడు, లజ్జాభిమానంబు లుజ్జగించి
తే. భీమభీమేశ్వరేశ్వర భీమనాథ, దక్షవాటిపురాధ్యక్షు దర్పకారి
సప్తగోదావరోత్సంగ జయమహేశ, నన్ను రక్షింపు మనుచు విన్నపము సేయు. 192

క. బాలోన్మత్తపిశాచద, శాలంబనమునఁ జరించు నంగడివీథిన్
వ్రీళాశూన్యతఁ గంఠే, కాలునిపాదములమీఁదఁ గలుగువిరాళిన్. 193

సీ. పరిరంభ మొనరించు బాహాద్వయంబున, దేవదేవుని సుధాదివ్యమూర్తి
దాఁకించుకొను జటాస్తబకంబు విరియంగఁ, బానవట్టముతోడ ఫాలతలము
గురుదక్షపురితోడఁ గూడఁ బట్టనమున, కంగప్రదక్షిణం బాచరించుఁ
బాతాళభైరవప్రముఖనానాదిశా, పరివారదేవతాప్రతతిఁ దెలుచుఁ
తే. గాశికాపట్టనద్రోహిఁ గావు మభవ, విశ్వపతిదూషితుని బ్రోవు విశ్వనాథ
కల్ల చేసితి రక్షింపు కాలకంఠ, యనుచుఁ బ్రార్థించు భీమనాయకునిఁ దపసి. 194

సీ. అఘముల కొండుప్రాయశ్చిత్తములు లేవు, నిన్ను జూచుటకంటె నీలకంఠ
నీమండలంబున నిఖిల జంతువులకుఁ, దారకం బల భ్రాంతి దశను దోఁచుఁ
గలియుగంబునయందుఁ గడుదుర్లభంబులు, భవదీయదర్శనస్పర్శనములు
నీదక్షవాటికానిలయంబునం దుండు, జనుకు భోగమోక్షములు వలఁతి