పుట:భీమేశ్వరపురాణము.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64 శ్రీ భీమశ్వరపురాణము

శానమహాట్టహాసరుచి సంపద సొంపు వహించి నట్టి శ్రీ
భానుజవైరిమండపము భవ్యమునీంద్రులు గాంచి రయ్యెడన్. 180

వ. అనంతరం బా బహిర్గేహప్రదేశంబున. 181

తే. నిఖిలపరివారదేవతానివహమునకు, వందన మొనర్చి రుత్తరద్వారభూమి
శశికళామండనునకును శంకరునకుఁ, జేసి రభివాదనంబులు సిద్ధమునులు. 181

ఉ. తండుభుజార్గళాకలితతప్తమహాకలధౌతఘంటికా
మండితవేత్రదండపరిమర్దనభీతివశాత్పలాయితా
ఖండలముఖ్యదైవతనికాయము సంయమిభాగధేయముం
ఖండకుఠారుమోసలసుఖంబునఁ జొచ్చిరి శైవపుంగవుల్. 182

వ. ప్రవేశించి భక్తిశ్రద్ధానుపూర్వంబుగా నంతర్భవనప్రదక్షిణంబు చేయునప్పుడు తిరుచుట్టు మాలికయందు. 183

సీ. వణఁకుగుబ్బలిరాచవారికూరిమికన్య, భీమయ్య శుద్ధాంతభామఁ గొలిచి
కంధరంబుననుండి గంధసింధురమైన, గుజ్జువేల్పుఁ గుమారగురుని గొలిచి
కైవల్యనిధికి దుర్గామహాదేవికి, సర్వమంగళకు నంజలి ఘటించి
యాశాతటీపటలీశాటికాకటు, వటుకభైరవు నిష్టవరదుఁ జూచి
తే. నలువ సేవించి యిందిరానాథుఁ గాంచి, యితరపరివారదేవతావితతి కెల్ల
నేటికోళ్ళిచ్చి యెక్కి రమ్మేటిమునులు, మృడునిహాటకశైలంబు మీఁదినిలుపు. 184

శా. సందర్శించిరి భీమనాథుఁ ద్రిజగత్సమ్మోహానాకారు న
ర్ధేందూత్తంసుని దక్షిణాబ్ధిలహరీహేలావిహారక్రమా
స్పందాయాగతగంధవాహపరిషత్పానాతిరేకస్ఫుర
త్తుందిస్వాంగకదందశూకకటకాస్తోకేష్టబాహార్గళున్. 186

క. దృష్టించి భక్తిపరతను, సాష్టాంగం బెరఁగి యమ్మహాదేవుని నా
శిష్టమునుల్ పూజించిరి, యష్టాపదనిర్మితంబు లగుకుసుమములన్. 187

ఉ. కేవలభక్తిసంపదలు గీలుకొనన్ హృదయాంబుజంబులన్
దేవరకుం గృపానిధికి దేవశిఖామణి కర్థిసప్తగో
దావరవాహినీకనకతామరసంబులఁ బూజ చేసె మై
త్రావరుణుండు దానును బరాశరిసూనుఁడు గూడి వేడుకన్. 188

వ. అప్పుడు పారాశర్యుండు పెన్నిధానంబుఁగన్న పేదయుం బోలెఁ బరమానందంబునుం బొంది కుంభసంభవుం జూచి మునీంద్రా, నీప్రసాదంబున భీమమండలం బవలోకించితి, ద్వాదశక్షేత్రతీర్థంబులు చూచితిఁ, బంచతీర్థంబు లాడితి, దక్షారామంబుఁ గంటి, భీమేశ్వరు దర్శించితి, ధన్యుఁడ నైతిఁ, గృతార్థుండ నైతి, నింక