పుట:భీమేశ్వరపురాణము.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46 శ్రీ భీమేశ్వరపురాణము

ననశ్వరమహైశ్వర్యంబును, నప్రతిమవైభవంబును, నవాఙ్మానసగోచరంబును, ససంఖ్యాతప్రమథగణసమాకీర్ణంబును నై , యశేషకల్యాణనిలయం బై యొప్పు నమ్మహాస్థానంబునందు. 18

సీ. పాటలంబగుజటాజూటంబునడునట్టు, పూపచుక్కలరాజు పొడవు చూపు
వెడఁద యైన లలాటవీథీవిటంకంబు, కట్టెఱ్ఱక్రొవ్వేఁడి కన్నుఁ గూర్చుఁ
గంబుసన్నిభ మైనకంఠప్రదేశంబు, గరళ కూటముఛాయఁ గ్రాఁచి యుమియుఁ
గడుమనోజ్ఞము లైనకర్ణపార్శ్వంబులఁ, బెనుపాఁవపోఁగులు బిత్తరించు
తే. భీమమండలికాపుణ్యభూమియందు, వివిధకైవల్యకళ్యాణవేది ననఁగఁ
గీటపక్షిసరీసృపక్రిమిచరాది, జంతుకోటికిఁ బ్రాణావసానవేళ. 19

సీ. ఒకచోటఁ గోటివల్ల్యుడు రాజకోటీర, విభ్రాజితోత్సంగ వృద్ధగంగ
యొకచోటఁ బీఠాంబికోన్నతస్తనభరా, స్ఫాలజర్జరితకల్లోల యేల
యొకచోటఁ జటులవక్రకుళీరపాఠీన, తోయగర్భాభోగ తుల్యభాగ
యొకచోట నప్పరోనికరసంసేవితాం,తరము శ్రీసప్తగోదావరంబు
తే. నమరు నాగరఖండసిద్ధాంతజాతి, నాగవల్లీసమాక్రాంత పూగఖండ
మండితోద్యానవాటికాఖండవిభవ, పాత్ర మగుభీమమండలీక్షేత్రమునకు. 20

సీ. త్ర్యంబకాచలశిఖాగ్రమునందు నుదయించి, పొదలి యార్యావర్తభూమిఁ దఱిసి
నులఁగి దండకవనీమధ్యభాగమున నా, ప్రప్రవణాచలప్రస్థ మొఱసి
పట్టిసశ్రీవీరభద్రేశు సేవించి, క్షేత్రసోమేశుమందిరము డాసి
యేచియనంతభోగేశ్వరస్థానంబు, రుద్రపాదములపైఁ ద్రోవ గాఁగఁ
తే. గోటిపల్లీశు కోమలాంఘ్రులకు మ్రొక్కి, కుండలాముఖక్షేత్రంబుఁ గుస్తరించి
భీమమండలి డాపలఁ బెట్టుకొనుచు, గౌతమీగంగ లవణాబ్ధి గౌఁగిలించె. 21

తే. నీరుకడఁ గోళ్లఁగూడిమున్నీటిఁగవయు
మొగులుబడి వాహినుల కెట్లు మొరయవచ్చు
వార్ధు లేఁడింటికి వలపువనిత యైన
మంగళోత్సంగగౌతమీగంగయెదుర. 22

ఉ. ఎక్కడఁ జూచినం సరసి యెక్కడఁ జూచిన దేవమందిరం
బెక్కడఁ జూచినం దటిని యెక్కడఁ జూచినఁ బుష్పవాటికల్
యెక్కడఁ జూచిన న్నది మహీవలయంబున భీమమండలం
బెక్కడ యన్యమండలము లెక్కడ భావన చేసి చూచినన్. 23

తే. బ్రహ్మహత్యాదులగు మహాపాతకములు
ధాత్రిజనులకు నిమిషమాత్రమునఁ బాయు