పుట:భీమేశ్వరపురాణము.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42 శ్రీ భీమేశ్వరపురాణము

క. అసమసమవిషమసమర, ప్రసృమరరిపు సుభటనిటల పట్టవిఘట్ట
వ్యసనదృఢదోఃకఠారా, కుసుమశరాసనసమాన కోమలమూర్తీ. 163

స్రగ్విణి. రామమాంబాసుతా రాజవిద్యాధరా
కామితార్థైకసంకల్పకల్పద్రుమా
వేమనక్షోణిభృద్వీరభద్రేశ్వరా
స్వామికార్యాభిరక్షాక్రియాదక్షిణా. 164

గద్య. ఇది శ్రీకమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర సుకవిజనవిధేయ శ్రీనాథనామధేయ ప్రణీతంబైన భీమేశ్వరపురాణం బను మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము.