Jump to content

పుట:భీమేశ్వరపురాణము.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 29

శలాకాశకలసంకోచంకరణంబులై యుంకురించినవియును, గొదమపసరుఱెక్కలపక్కిఢాలు పుక్కిలించి యుమయంజాలు చాయ లేర్పడం బసరుపాఱునవియును, దక్షారామ రామాజనంబుల చిఱుపిక్కలచక్కఁదనంబుల నెకసక్కెంబాడు బిగువుపొట్టలం గనుపట్టునవియును, బథికనాసాపుటీకుటీరంబులకుఁ గుటుంబకములగు కమ్మదనంబులీని పాలుకుడిచి సుందరీప్రాయంబున సామువలచునవియును, బదియాఱువన్నె కుందనంపుఁదగడుఁ దెగడుచుఁ బండి యుద్ధండకేదారవలయకుముదషండంబు లాఘ్రాణింపనుం బోలెఁ గైవ్రాలునవియు నై కలమశాలిశారదాముఖాదివ్రీహిసస్యంబులవలనను, నిరంతరనారికేళచ్ఛదచ్ఛాయాచ్ఛన్న హరిదంతరంబుల భుజంగవల్లీమతల్లికాలింగిత క్రముకకంఠోపకంఠంబులఁ గ్రీడించు క్రోడదశనదష్ట న్వాదిష్టపనసఫలరససారణీపరంపరా సంపూర్ణచంపకద్రుమాలావాలవలయంబులును, వనదేవతావిలాసతాళవృంతాయమాన రంభాపలాశసంభారంబులఁ, దిలకతిలకితంబులు, విదేశవిచికిలంబులు, గోరకితకురువకంబులు, నిబిడరసకేసరంబులు, నఖిలభుననాభిరామంబులు నైనయారామంబులవలనను గన్నులపండువై కుంతీమాధవదేవునకు విశ్రాంతిప్రదేశంబును, హుంకారిణీ మహాదేవికి విహార సంకేతభవనంబును, బీఠాంబికాలక్ష్మి కాటకూటంబును, హేలాసానికి హాలాపానగోష్ఠీమంటపంబును, ననందగి భూతబేతాళడాకినీ ప్రేతరంక భైరవవ్రాతనిర్మిత ప్రాకారవప్రహట్టకుట్టిమంబగు పీఠాపట్టనంబుఁ బ్రవేశించిరంత. 55

సీ. త్రపుసపుష్పలతామతల్లీపటోలికా, కారవేల్లకుడుంగకములతోడఁ
గూష్మాండవృంతాకకోలకచించికా, కాయమానకదంబకములతోడ
శాకినీమూలకచ్ఛత్రాకసారణీ, ధాన్యాకమేఘనాదములతోడఁ
బిప్పల్యుపోదకీ పీతపలాండుక, వాస్తుశాఖాకోటివాటితోడ
తే. రాజనలతోడ శృంగబేరములతోడఁ, జిఱుగడఁపుఁ బెండలముతోడఁ జేమతోడ
నొప్పునాలుగు పొలములం దుపవనములు, భువనసారము పీఠికాపురవరమున. 56

ఉ. హాటకపానపాత్రయును నారఁగఁబండినమాతులుంగముల్
ఖేటము లోహదండము నొగింధరియించి పురోపకంఠశృం
గాటకభూమిభాగమునఁ గాపురముండెడు పీఠికాంబకుం
గైటభదైత్యవైరి ప్రియకాంతకు మ్రొక్కె నతంబు భక్తితోన్. 57

శా, అంతర్వాణి భజించెఁ గుక్కుటపతిన్ హాలాహలగ్రీవునిన్
శాంతస్వాంతుఁడు గొల్చె దానవచమూసంహారిణిన్ హుంకృతిన్
జింతించెన్ మునిసార్వభౌముఁడు పురక్షేత్రాధిదైవంబులం
గుంతీమాధవుఁ బూజ చేసె ఋషివాక్పుష్పోపహారంబులన్. 58