20 శ్రీ భీమేశ్వరపురాణము
కేలిగడలుకొను పసిమిగలపసిండితగటునుం దెగడు నునుదొడలజిగియును, బగడంపుఁ జిగురుటధరములతుదల నిగురుచుఁ జిఱుతనగవులుబిగియనగినం దెగిపడి యెడుననువడువున నడుగడుగునకు వడవడవడంకుచుం బిడికిటనడంగు నడుముల బెడంగునుంగలిగి, భుగభుగం గురంగనాభిసౌరభసారంబులతోడంగూడి సంకుమదపంకపరిమళంబుల ఝంకించు కర్పూరవాసనాసముల్లాసంబును, గర్పూరవాసనాసముల్లాసంబు నుల్లసంబాడు కాలాగురుకర్దమామోదంబుననుంబునుం గుపసం బిసాళించు గొజ్జంగినీటినెత్తావియును, గొజ్జంగినీటినెత్తావి బిత్తరించు గంధపొడిపొలుపును, గంధపొడి పొలుపునుం గుమ్మరించు ధమ్మిల్లమల్లికాహలకవకుళవాసంతికాజాతికేతకీకుందకుసుమగంధంబులును నిఖలదిక్సంధిబంధంబుతో బాంధవం బనుసంధింప, నిలింపగంధర్వాప్సరోజాతులగు సానికూఁతులు గొలువ, జగనొబ్బగండ జగదగోపాల పల్లవాదిత్య పల్లవత్రినేత్ర కేళాదిరాయ రాయవేశ్యాభుజంగ బిరుదాభిరామాల్లయ వేమభూపాల రాజ్యభారధురంధరుండై, బెండపూఁ డన్నయమాత్యుఁడు గట్టించిన మొగసాలవాకిటి మహోత్సవమండపంబునందుఁ, బేరోలగంబుండి, కుండలీదండలాపకప్రేరణీప్రేంఖణసింధుకందుకధమాళిచేలమతల్లీహల్లీపకాదినృత్యంబు లవలోకించుచుఁ, బంతంబు లపధరించుచు, మేలంబు లాలకించుచుఁ, జంపూచాటునాటకోదాహారణజయఘోషచక్రవాళచతుర్భద్రచతురాతిప్రబంధంబు లాకర్ణించుచు, వేణువీణామృదంగకాంస్యకాహళపటహఢక్కాహుడుక్కానకఝల్లరీహృద్యవాద్యానుషంగంబు లాదరించుచు, సంగీతభంగీతరంగంబు లంగీకరించుచు, నిగమంబులు గ్రహించుచుఁ, బురాణంబులు వినుచు, నితిహాసంబు లిచ్చగించుచుఁ, దర్కంబులు వితర్కించుచు, నాగమంబులు పరీక్షించుచు, నిఖిలలోకరక్షణార్థంబుగా వివిధవిద్యాకలాపంబులు వినోదించుచుండు. 118
క. ఏతాదృశప్రభావో, పేతుండగు దక్షవాటి భీమేశ్వరువి
ఖ్యాతకథ చెప్పెదను శుక, తాతకృతపురాణసరణి తప్పక యుండన్. 119
కథాప్రారంభము
వ. ఇమ్మహాపురాణంబునకుఁ గథాక్రమం బెట్టిదనిన:— నైమిశారణ్యపుణ్యక్షేత్రంబున ద్వాదశవార్షికంబైన దీర్ఘసత్రంబు ప్రవర్తిల్లుచుండఁ గులపతిశౌనకుండను పరమఋషి మొదలుగాఁగల సంయమీశ్వరులు యదృచ్ఛాసమాగతుఁడైన రోమహర్షణపుత్రుఁ బాదరాయణప్రియశిష్యుం బౌరాణికు సూత్యాహసంభవు సూతు నర్చించి యతనివలనను బంచాశత్ఖండమండితంబును, బహుసంహితాసమాకీర్ణం