పుట:భీమేశ్వరపురాణము.pdf/39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 19

.

సీ. [1]నేదిష్ఠమున సప్తగోదావరంబున, నఘముర్షణస్నాన మాచరించి
త్ర్యాయుతమంత్రాక్షతాభిమంత్రితమైన, విమలభూతి త్రిపుండ్రము ధరించి
మొగలివాకిలిఁ దూఱి దిగువ శాక్వరరాజు, నగరిపై వెన్నుని ననువుఁ జూచి
మణిశిలాసోపానమధ్యమార్గంబుగా, నభ్రంకషంబైన హర్మ్య మెక్కి
తే. సప్తపాతాళభువనవిష్కంభములను, దెఱచి వెడలినజ్యోతిఃప్రదీప్తమూర్తి
శంభుభీమేశ్వరేశ్వరస్వామిఁ గొలుచు, పరమమాహేశ్వరున కేమి బ్రాఁతిముక్తి. 114

క. పరమాశించును భీమే, శ్వరు ననుమతిఁ జేసి చోడవంశాభరణుం
డరికాలుఁడు కరికాలుఁడు, ధరణీధరపత్ని మనసు దైన్యము ముంచెన్. 115

సీ. గజచర్మ మెన్నఁడోకాని నిచ్చలుగట్టు, పసిఁడికమ్ములపట్టుపచ్చడంబుఁ
భసిత మెన్నఁడొకాని ప్రతిదినంబునలందు, మలయజంబు కురంగమదము గూర్చి
నిడుదపాములరాజుతొడవు లెన్నఁడొకాని, తారహారములు నిత్యము ధరించు
నృకరంకరుండమాలిక లెన్నఁడోకాని, ధరియించు కహ్లారదామ మెపుడు
తే. కాటనడుచక్కి నెన్నఁడో కానియుండు, దక్షవాటిసువర్ణసౌధములమీఁద
నెన్నఁడొ పిశాచులనుగాని యిందుముఖుల, నెల్లకాలంబుఁ దలఁచు భీమేశ్వరుండు. 116

సీ. ఒకవేళ ధరియించు యవనాశ్వుఁ డిచ్చిన, కట్టాణిముత్యాలకంఠమాల
మాంధాతృఁ డిచ్చిన మాణిక్యఖచితకే, యూరంబు ధరియించు నొక్కవేళ
నిక్ష్వాకుఁ డిచ్చిన హీరాంకురంబుల, యుంగరంబు ధరించు నొక్కవేళ
ఘనచక్రవర్తి యిచ్చిన ప్రవాళంబుల, యొడ్డాణము ధరించు నొక్కవేళ
తే. వేడ్క ధరియించు నొక్కొక్కవేళయందు, భరతదుష్యంతరంతినాభాగనహుష
నలభగీరథనృగమహీ, నాథదత్త హేమమణిభూషణములు భీమేశ్వరుండు. 117

వ. వెండియు భీమేశ్వరుండు పండువుపండువు నఖండవిభవంబున నాఖండలాదివిబుధమండలంబు పరివేష్టింప చలిగొండరాచూలియుం దానును మార్తాండచంద్రమండలంబువలనను బాలసముద్రంబువలనను మధుకైటభారియూరుకాండంబువలనను గృపీటభవజ్వాలాజాలంబువలనను గంధర్వసార్వభౌమువలనను బ్రభవించి కంతుకుంతంబులనఁ గాముతోమరంబులన మదనుముద్గరంబులన శంబరారికఠారంబులన నంగభవుకొంగవాలులన సిరిపట్టిసెలకట్టియలనవలరాజుభిండివాలంబులనఁ, దళతళంబొలయు తొలకరిమెఱుంగుమొలకలఁ గలకలనగు కలికి తెలిగన్నుఁగవయును, జక్కవకవలఁ దక్కువపఱచుచుఁ గ్రిక్కిఱిసిన మెఱుంగునిబ్బరంబుగుబ్బచన్నులును, మిలమిలని జిలుఁగువలిపెంపువలువల తెరలయెడల వెలువడి

  1. నేదిష్టము = మిక్కిలి సమీపము