Jump to content

పుట:భీమేశ్వరపురాణము.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 17

దూరీకృతశంభళీకపోలకస్తూరికాపత్రభంగంబులగు నప్పరోంగనావాటంబులచేతను, గుట్టిమఖచితమణికిరణవిసరణజనితాకాండప్రసారితకదళీపలాశసంగతిసంశోభితకక్ష్యావిభాగంబులగు యక్షగంధర్వకిన్నరకింపురుషసిద్ధవిద్యాధరస్థానంబులచేతను, గారుత్మతరత్నాంశుపటలఘటితపటయామినీతారకాయమానస్థల ఖచితస్థూలముక్తాఫలశలాకానికాయంబులగు భైరవాయతనంబులచేతను, బ్రస్నిగ్థశ్యామలశిలోత్కీర్లరమ్యోపనాహ్యశాక్కరంబులగు శంకరాగారద్వారంబులచేతను, దులసీదళశీతలామోదముషితకిల్బిషంబులగు విష్వక్సేనధామంబులచేతను, నిరంతరసంఫుల్లమల్లీవల్లికాతల్లజపుష్పనిష్యందమానమధుమత్తపుష్పంథయవిరుతీపునీతహరిదుపఘ్నంబులగు విఘ్నేశ్వరావాసలలితోద్యానంబులచేతను, బృథులవారిశీకరపటలపానదరవికటకరటిముఖవికలితవరాటకోశవ్యాకోచహాటకకుశేశయంబులగు సప్తగోదావరప్రవాహసలిలంబులచేతను, గోమలకింజల్కాగ్రగ్రసనజాగ్రచ్చక్రవాక చరణనఖశిఖరసముల్లిఖితకమలకువలయకుముదషండంబులగు తీర్ఘకుండంబులచేతను, గోదానరీతుల్యభాగాకౌంతేయాకణ్వాపగానదీమాతృకాయమానంబై యిరుగారును బంటపొసంగుపంటవలంతి కేదారక్షేత్రంబులచేతను, నఖండితాంభస్సమృద్ధి విజృంభించి విశ్వంభరాభ్రూలతాకారిసేతురేఖాంకారంబులై తటతరుకుసుమాంతరక్షరదమందమకరంద సందోహస్యందనకల్లోలంబులై సలిలకేలీలోలకలహంసకామినీకోలాహలానుకృత జలదేవతాచరణమణినూపుర ఝణఝణత్కారంబులై కారండవపక్షవిక్షేపపరిచరిత పంకజపరాగపాళీవిరచితాళీకసంధ్యానుబంధచరితచక్రవాకమిథునంబులై పయోధిగన్నబిడ్డలుంబోని యొడ్డుచెఱువులచేతను, సరససహకారశాఖాశిఖాధిరూఢకోకిలకుటుంబషేకంఠసాళ కోమలకుహూకారకోలాహలకలిత విరహిణీహృదయహాలాహలక్షేపంబులుసు మధుకరనికరగుంజాయమానమాధవీనికుంజకుంజన్నిహితకిరణపుంజంబును సముద్భిన్నపున్నాగకుసుమపరిమళోద్గారనీహారంబులును సముల్లసితచంపకకళికాకలాపకల్పితకందర్పపావకాస్త్రపరిత్రప్తపథికలోకంబులును, బాకపరిస్ఫుటితపుండ్రేక్షుపర్వముఖోద్గీర్ణముక్తామణిదర్శితాకారరాకానిశాకరప్రకాశంబులును గోరకప్రకరతారతారకితకురువకానోకహంబులును వనితావదనాసవసనాథవకుళవనంబులును మహోరుకుచకలశకాంతిచోరఫలకలితలికుచనిచయంబులును మాతులుంగామోదహృదయంగమంబులును నవనాగరంగసంగసుఖతసారంగమంగళగానసరససంగీతప్రసంగంబులును భుజంగలతాపరిష్వంగధన్యతరుణపూగద్రుమంబులును, లలితలవలీలతాలింగితలవంగంబులును నగు శృంగారారామంబులచేతను, నధిగామంబై; కలితచాతుర్వర్ణ్యస్థితియగుటం ద్రైలోక్యతిలకంబును, సముద్భాసితాసం