పుట:భీమేశ్వరపురాణము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16 శ్రీ భీమేశ్వరపురాణము

గనకసౌగంధికగంధోత్తమాగంధ, సారనిష్పంద పుష్పంధయంబుఁ
జటువీచీఘటాఝాటుడోలారూఢ, హంససంసన్నినాదాలసంబు
తే. భూరితీరావనీఘనీభూతచూత, జాతివకుళవనీసమాచ్ఛాద్యమాన
బహుళ సింధుధునీవనబకమరాళి, దక్షపురియొద్ద సప్తగోదావరంబు. 106

సీ. సరివచ్చు ననవచ్చు శతమన్యువీటికి, వివిధదేవాగారవిభ్రమమునఁ
బ్రతివచ్చు ననవచ్చు బాలమున్నటికి, నక్షయం బగు జీవనాభివృద్ధి
నెనవచ్చు ననవచ్చు నిందుబింబమునకు, సకలకళావిలాస ప్రవృద్ధి
దొరవచ్చు ననవచ్చుఁ దోయజాక్షునిమూర్తి, కభిరామలక్ష్మీసమగ్రమహిమఁ
తే. బెప్పనొప్పదె యప్సరస్స్త్రీసహస్ర, ధనళతరదీర్ఘదృక్పుటధాళధళ్య
సమ్మిళద్భీమునాథ భూషాశశాంక, తరళదీధితిపరిపాటి దక్షవాటి. 107

క. రోధించు నభముఁ బటికపు, సౌధంబులు నీట భీమశంకరహర్షో
త్సేధాట్టహాసరేఖా, దీధితిమైత్రీత్రిధావిధేయము లగుచున్. 108

చ. ప్రహరిచరింతు రెప్పుడును భైరవు లర్ధనిశాగమంబులన్
గహకహనిష్ఠురాట్టహసగర్వితకంఠకఠోరహుంకృతుల్
బహులభుజాడమడ్డమరుభాంకృతినాదము మేళగించి ది
క్కుహరము లోర్చు హాటకపుఁగోటలమీఁదట దక్షవాటికన్. 109

వ. మఱియు నప్పురంబు దళితసమదకరిసహస్రంబు లగు సుభటసహస్రంబులవలన సింహసంహతియు, సమధికవితరణశాఖానిరాఘాటకీర్తిస్ఫూర్తులగు వదాన్యులవలనఁ బారిజాతోద్యానంబును, ననేకశతసవనసమజ్యోతిరార్హియుగు సుమనోవర్గంబువలన సుధర్మాస్థానంబును, నభిరామరామణీయక సౌభాగ్యరేఖావిలాసపక్ష్మాంతలక్ష్మీవిరాజమానంబగు రాజకుమారలోకంబులవలన గంధర్వలోకంబును, మకరకచ్ఛపముకుందనిధిసనాథులగు వైశ్యులవలన వైశ్రవణస్థానంబు ననం దగి, సకలభువనప్రశస్తంబై; భారతవర్షంబునకు ఫలసంపదయునుంబోలె శాఖానగరసహస్రసంబాధపరిసరంబై ; సకలజగన్నిర్మాణమాతృకయగు కృతయుగంబునకుం గారణంబనఁ గనకగిరివప్రదీప్రప్రాకారబహుప్రకారప్రప్రకరపరివేషవలయవలయితంబై; సలీలసంక్రాంత కనకావరణమండల ప్రతిబింబంబగుటం జేసి కులిశపతనభయానగాహహాటకక్షితిధరంబగు నపరాంబురాశియుంబోని పరిఖాచక్రంబుచేతను, గ్రీడాగజమదజలపంకిలప్రాంగణంబులగు భృంగిరిటినికుంభకుంభోదరప్రధాన ప్రమథగణమణిభవనసౌధంబులచేతను, నాసన్న దీర్ఘకావీచీపవనవికీర్యమాణ వికస్వరజలజనిష్యందమధుబిందువర్షాంబు