పుట:భీమేశ్వరపురాణము.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12 శ్రీ భీమేశ్వరపురాణము

తే. బ్రాగ్దిశావప్రగోపురప్రాంగణమున, సప్తమునిసింధుసోపానసరణికెలనఁ
దీర్చె భవనంబు భీమయదేవునగర, మంత్రి దేవయ యన్నయామాత్యవరుఁడు. 75

ఉ. భావన సంతసిల్లంగ బ్రవిభావనజాఫుని విద్విషత్పరీ
భావనవీనశౌరిఁ బ్రవిభావనుని న్నిఖిలక్షమాజనుల్
దీనన లిచ్చి యెప్పుడు సుధీవనరాశి నుతింతు రుత్తముల్
దేవనమంత్రియన్న విభు[1]దేవనదీవనపావనాన్వయున్. 76

క. సిరియేలికయగువరకే, సరి యేమో కాని గర్వసంరంభము మై
సరి యేపొనరఁగ వితరులు, సరియే యరియేటియన్న సచివాగ్రణికిన్. 77

శా. కాంచీకంకణతారహారకటకగ్రైవేయభూషావళుల్
లంచంబిత్తురు దూతికాతతికి లీలన్ బెండపూడన్ననిన్
బంచాస్త్రోపముఁ దారతార కవయన్ బ్రార్థించి లోలోపలన్
బంచారామములందుఁ బల్లెలఁ బురిం బ్రౌఢేందుబింబాననల్. 78

తే. తారగిరిమందరముల బృందారకాది, తారకారాజవదనలు తారుతార
తారధారాశ్రుతిస్వరోదారలీలఁ, బాడుదురు బెండపూఁడన్న భవ్యకీర్తి. 79

సీ. కలకంఠములఛాయఁ గల కంఠకోణంబు, నాగకుండలముల నాగరికతఁ
[2]జూడఁజూడఁగ నొప్పు సురసరిత్పూరంబు, గాలఁగాలవిభాళ కటకముద్ర
మేన మేనాత్మజామానినీరత్నంబుఁ గేలికురంగంబుఁ గేలి వ్రేల
భస్మోపవాహంబుఁ బాండుదేహంబునఁ, గటిని బుట్టంబైన కరటితోలు
తే. వికటశృంగారమున నొప్పు వేల్పు ఱేని, నాగమోపనిషన్మనోహరుని హరుని
కర్చనము సేయు సంధ్యాత్రయంబులందు, బెండపూఁడన్న కన్నులపండువుగను. 80

సీ. అఖిలదిగ్దంతిదంతార్గళంబు వ్రాయు, నధిపుదిగ్జయశాసనాక్షరములఁ
గువలయాక్షుల మించుగుబ్బచన్నుల వ్రాయుఁ, గుంకుమపత్రభంగాంకురముల
గర్వితారాతివక్షస్స్థలంబుల వ్రాయు, [3]నయకార్యసరణికిణాంకములను
నర్థిసందోహఫాలాంచలంబుల వ్రాయు, లక్ష్మీప్రదములైన లక్షణములఁ
తే. బసిఁడిగంటాస భూపాలుపార్శ్వసీమ, వ్రాయు నయకావ్యసరణి కేవలమకాదు
వేమధాత్రీకళత్రు గారాము మంత్రి, యతులగుణహారి బెండపూఁడన్నశౌరి. 81

షష్ఠ్యంతములు

క. ఇట్టి మహిమంబు గలు జగ, జెట్టికి నర్థార్థిలోకచింతామణికా
రట్టహయధట్టసేనా, ఘట్టితరిప్పుపట్టనోప కంఠక్షితికిన్. 82

  1. దేవనదీ = గంగ; వనము = జలము
  2. చూడన్ = శిరస్సునందు
  3. నయకార్యసరణికిణాంకములు = నీతికార్యమార్గరూపము లగు కాయల చిన్నెలు