పుట:భీమేశ్వరపురాణము.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10 శ్రీ భీమేశ్వరపురాణము

ధీరోదాత్తుఁడు లింగమంత్రివిభుఁడున్ ధీశాలి తల్లన్నయున్
బారావారగభీముఁ డన్నధరణీపాలుండు లక్ష్మీనిధుల్. 59

ఉ. సంగరసవ్యసాచికిఁ బ్రశస్తవితీర్ణిదధీచికి న్మహా
మంగళచారుమూర్తికి సమంచితనిర్మలధర్మమూర్తికిన్
లింగనమంత్రికిన్ విశదనీతిధురావిబుధేంద్రమంత్రి కు
త్తుంగతరప్రతాపగుణధూర్జటి కెవ్వరుసాటి ధారణిన్. 60

సీ. ఖండశర్కర జున్ను కండచక్కెరలు దో, సెలు వడ ల్సేవెపాసెములతోడఁ
గమ్మఁగాఁ గాఁచిన కఱియాలనేతితోఁ, గమనీయపంచభక్ష్యములతోడ
సంబారములతోడి శాకపాకముతోడఁ, బక్వమైన పెసరపప్పుతోడఁ
దేనియధారతోఁ బానకంబులతోడ, [1]శిఖరషాడబరసశ్రేణితోడ
తే. నచ్ఛలవణాాదికముతోడ నమృతఖండ, పాండరంబైన దధితోడ బ్రాహ్మణులకు
భోజనము వెట్టు ద్వాదశీపుణ్యవేళ , లింగమంత్రి నవీనరుక్మాంగదుండు. 61

క. ప్రతిఘటియింపఁగవచ్చునె, ప్రతిభటులకు నసమసమరఫల్గునుతోడన్
శతకోటిదృఢకఠార, క్షతశాత్రవుతోడ లింగసచివునితోడన్. 62

సీ. ఝాడేశవనసప్తమాడెబారుహదొంతి, వంతునాదిక్షితీశ్వరుల గెలిచి
యొడ్డాదిమత్స్యవంశోదయార్జునుచేతఁ, బల్లవాధిపుచేతఁ [2]బలచమంది
దండకారుణ్యమధ్యపుళిందరాజరం, భాహివంశజులకు నభయ మొసఁగి
భానుమత్కులవీరభద్రాన్నదేవేంద్ర, గర్వసంరంభంబుఁ గట్టిపెట్టి
తే. యవనకర్ణాటకటకభూధవులతోడ, బలిమి వాటించి యేలించెఁ దెలుఁగుభూమిఁ
దననిజస్వామి నల్లాడధరణినాధు, బళిరె యరియేటిలింగన ప్రభువరుండు. 63

క. దేవబ్రాహ్మణభూములు, భూవరునకుఁ జెప్పి ధారవోయించె భళీ
దేనయలింగన ప్రియసం, భావననిరుపాధి సర్వమాన్యంబులుగన్. 64

చ. అవుర! ప్రతాపవేమ వసుధాధిపుచే నృపపట్టభద్రుచే
భువనమనోహరంబయిన బోడసకుర్తి మహాస్థలంబునన్
దివిరి పరిగ్రహించె మన దేవయలింగయమంత్రియన్న చో
డవరమహాగ్రహారముఁ గడంకఁ గవిద్విజబంధురక్షకై. 65

సీ. [3]వాహ్యాళిభూమి వేవంతనైషధు లట్లు, హయరత్నముల నెక్కి యాడనేర్చుఁ
గవిబుధశ్రేణికిఁ జెవులు పండువులుగా, నాస్థానమున మాటలాడనేర్చు

  1. శిఖర = పండిన దానిమ్మగింజల; షాడబ = మధురమైన; రస = సారము
  2. పలచము = కప్పము
  3. వాహ్యాళి = స్వారి