పుట:భీమేశ్వరపురాణము.pdf/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 9

లక్ష్మీవంతులు దేవమంత్రియును దల్లప్పప్రధానుండు స
ర్వక్ష్మాధీశసభాంతరస్తుతనయప్రాగల్భ్యవాచస్పతుల్. 52

క. పన్నీట గంధజలమున, నన్నయతల్లప్రధానుఁ డభిషేకింపన్
గన్నప పుక్కిటినీటను, గన్న యరోచికము వాయుఁ గఱకంఠునకున్. 53

సీ. ముక్కంటిదరహాసమున కనుప్రాసంబు, మిన్నేటినీటికి మిక్కుటంబు
శారచజ్యోత్స్నాప్రసాదంబునకు [1]వీప్స, నలువశుద్ధాంతంబున కనుభాష
కల్పకారామరేఖకుఁ బ్రతిచ్ఛందంబు, [2]త్రిదశేంద్రుకరటి కామ్రేడితంబు
పుండరీకారణ్యమునకు నధ్యాహార, మమృతాంబునిధి కభిధాంతరంబు
తే. గంధసారతుషార[3]పాణింధమంబు, దానవిద్యావిలాస విద్యాధరుండు
మంత్రి యన్నయదేవయ్య మహితయశము, నిఖలదిక్తటమంతయు నిండియుండె. 54

మహాస్రగ్ధర. వియదాశాభూతధాత్రీవిహృతికలననిర్విఘ్నసంభారనిఘ్నా
వ్యయకీర్తిస్ఫూర్తిముద్రాహసితశశికిరీటాట్టహాసస్వయంభూ
దయితామందారచంద్రాతపసురతటినీతారనీహారుతో న
న్నయదేవామాత్యుతోడన్ హరిహర సరియే యన్యభూపాలమంత్రుల్. 55

ఉ. ధీరుఁడు దేవమంత్రి నయధీగుణనిర్జిత దేవమంత్రి శ్రీ
వీరయదేవవల్యధిపవిశ్వవిభుప్రియపుత్రి రామమాం
బారమణీమణిన్ భువనపావనవర్తనఁ బెండ్లియాడె నం
భోరుహనేత్రుఁ డంబునిధిపుత్రికఁ బెండిలి యాడుకైవడిన్. 56

సీ. జగదేకసంస్తుత్యసౌభాగ్యసంపద, రతిదేవిఁ బోలు నీరాజవదన
పరమపాతివ్రత్యభాగ్యగౌరవమున, భూపుత్రిఁ బోలు నీపువ్వుఁబోణి
యక్షీణమహిమఁగల్యాణవైభవమునఁ, బార్వతిఁ బోలు నీపద్మగంధి
మృదుగభీరప్రౌఢమితభాషణంబుల, భారతిఁ బోలు నీపరమసాధ్వి
తే. యనుచు బంధులు వినుతింప నవని మించె, నధికశుభగాత్రి విశ్వనాయకుని పుత్రి
యన్నవిభుదేవమంత్రి యర్ధాంగలక్ష్మి రమ్యసద్గుణనికురుబ రామమాంబ. 57

తే. సింధుకరికాళ భల్లాణసేనయాది, పరమమాహేశ్వరాచారపరులసరణి
నన్నవిభుదేవయామాత్యు నెన్నవచ్చుఁ, బార్వతీవల్లభునిమీఁది భక్తిగరిమ. 58

శా. ఆరామాంబకు దేవమంత్రికిని దక్షారామభీమేశ్వర
స్ఫారాపారకృపాగుణోదయమునం జన్మించి రాత్మోద్భవుల్

  1. వీప్స = పరంపరగా వ్యాపింప నిచ్ఛ
  2. త్రిదశకేంద్రుకరటి = ఐరావతము
  3. పాణింధమంబు = కొలిమితిత్తి