8 శ్రీ భీమేశ్వరపురాణము
యాదికల్పంబునాఁ డఖిలప్రపంచంబు, సృజియించు బ్రహ్మకుఁ జేయిదోడు
పరశురామునిచేతఁ బాథోధిమేఖలా, భరము దానముఁ గొన్న బ్రాహ్మణుండు
తే. పేరుదక్షప్రజాపతి పెండ్లికొడుకు
కశ్యపబ్రహ్మ నిజవంశకర్తగాఁగ
వెలసెను భయాన్వయంబులు వృద్ధిఁబొంద
వ్రాలుఁబ్రాలునుగలమంత్రి పోలమంత్రి. 45
క. సాటి చదతేటినీటికి, హాటకగర్భునివధూటి కమరద్రువనీ
వాటికి [1]మధుకైటభరిపు, వీటికి శ్రీపోలమంత్రి విశదయశంబుల్. 46
క. ఆమంత్రికి నుదయించిరి, శ్రీమంతులు కార్యఖడ్గజ్రీతవైరిమహా
సామంతులు శ్రీయల్లా, డామాత్యగ్రామణియును నన్నవిభుండున్. 47
క. అల్లాడవిభుఁడు రిపుహృ, గ్భల్లాడంబరుఁడు నాఁడు భామలమనసుల్
గొల్లాడఁగ మదనుఁడు దిశ, లల్లాడఁగఁ జేయుఁ దద్భుజాటోపంబుల్. 48
సీ. కాకతిక్ష్మాాపాలగంధదంతానళ, ధ్వజినీమహాధురంధరుఁ డనంగ
నవలక్షకోదండనాథరాజ్యాంభోధి, సంపూర్ణపూర్ణిమాచంద్రుఁ డనఁగ
నంధ్రభూమండలాధ్యక్షసింహాసన, సంప్రతిష్టాపనాచార్యుఁ డనఁగ
వీరరుద్రాశేషవిశ్వంభరాధీశ, పృథులదక్షిణభుజాపీఠ మనఁగ
తే. యవనసంహారవిలయకాలాగ్నియనఁగ, ధాటివిఘటితకుమ్మఠోద్యానుఁ డనఁగ
విశ్వలోకప్రశస్తుఁడై వినుతి కెక్కె, నతులబలసీరి పోలయ యన్నశౌరి. 49
చ. కొలనుఁ బ్రతాపరుద్రనృపకుంజరుచేత నరేంద్రసారణీ
సలిలవివర్ధమానబహుసస్యసమాకుల మగ్రహారమై
వెలయ విభాకరగ్రహణవేళఁ దగంగఁ బరిగ్రహించి బం
ధుల భరియించె నన్నవిభుతో సరియెట్లు ప్రధాను లెవ్వరున్. 50
శా. అయ్యన్నయ్యకు యావదర్థపదగర్హానర్హగంభీరవాక్
శయ్య [2]న్గైటభవైరిశయ్యకు ఘనుల్ షాడ్గుణ్యవిద్యానిధుల్
[3]త్రయ్యంతజ్ఞులు దేవధీమణియునున్ దల్లప్రభుండున్ సుతుల్
వియ్యం బందుఁ దదీయకీర్తులు దిశావేదండతుండాళితోన్. 51
శా. లక్ష్మీదేవిఁ బయోరుహేక్షణునిఁ బోల్పం బాత్రులై యొప్పు శ్రీ
లక్ష్మీదేవికి నన్నమంత్రికి సుతుల్ లావణ్యసంపన్నిధుల్