షష్ఠాశ్వాసము
131
| నిరవకాశంబుగా నిత్యసన్నిహితంబు, నుడులింగమూర్తితో నుబ్బియుబ్బి | |
తే. | భయమునుం బొంది దేవతల్ ప్రస్తుతించి, యయ్య నీరూప మింతింత యనఁగ రాదు | 75 |
వ. | అనినం గరుణాసామ్రాజ్యపట్టాభిషిక్తుం డగు నాజగజట్టివేల్పు బ్రహ్మాండగోళంబునకు మిక్కుటంబుగాఁ బెరిఁగిన దేహంబు బొట్టి చేసి తీరుచుట్టుమాలికలోన గౌరీ, జనార్దన, రుద్ర, కేశవ, వినాయక, దుర్గాతాండవేశ్వర, నృత్యభైరవులను దేవతాసప్తకంబు పరివేష్టింప, సకలలోకానందకరపరదారగమనపాపహరేశ్వరులు నైఋతిభాగంబున నధివసింప, నంతర్గర్భగృహంబులోపల మాణిక్యాదేవిసహితుండై సలిలనిధివృద్ధగంగాకౌంతేయసరిత్తుల్యభాగాహేలానదీసప్తగోదావరమాతృకాపరివృతమండలంబున మధ్యమలోకభాగధేయంబును, విబుధగంధర్వపతాకావేదియుఁ, బరిసరోద్యానవాటికాసరసకాసారకఠోరకుహళీపాళికాకుసుమధూళీమధూళికాసౌరభాసారసంవాసిత దశదిశాముఖంబును, మఖకుండితటాకసముద్ధండపుండరీకషండమకరందబిందుగండూషావ్యగ్రసముసముదగ్రమధుపమండవాహంకారఝంకారకోలాహల కరంబితమకరధ్వజభుజాదండమండలీకృత కుసుమకోదండశింజనీఠంకారంబును, నాఖండలాదిదిక్పాలకభరితకలితగోపురప్రాంగణంబును, బాదుకాఖడ్గఘుటికారసరసాయనిమూలికాంజనాకర్షణాదృశ్యాది విద్యాసిద్ధిక్షేత్రంబును, నత్ర్యాత్రేయాగస్త్యహరితాంబరీషాసితభార్గవ పరాశర పారాశర్య మాండవ్య మార్కండేయ మౌద్గల్య మంకణ శౌనక శాండిల్య మందపాల వత్స వసిష్ఠ వాధూలసవాలఖిల్య కౌండిన్య కాశ్యపకణ్య గాలవ గాధి గార్గ్య ప్రముఖ వాలఖిల్యాద్యష్టాశీతిసహస్రసంయమసమాకీర్ణంబును, గర్ణికారాంబికాకరకమలపుటఘటితకనత్కనకమణిమయడమరుఢమఢమధ్వానపర్జన్యసముజ్జృంభిత గుహశిఖండితాండవంబును మార్కండేశ్వరకుండలాముఖసంవేద్యాంతర్వేదిచాళుక్య భీమేశ్వరప్రధాననానావిధశాఖోపశాఖాతీర్థసంబాధసంభరితంబును నై యఖిలభువనభవనాభిరామంబైన దక్షారామంబును గైలాసమేరుమందరంబులకంటెను, గాంచీ చిదంబర కాళహస్తి కాశి శ్రీశైలాది మహాస్థానంబులకంటెను, సేతు కేదారంబులకంటెను, నతిశయంబుగాఁ జేసి నాక్షేత్రంబునుమరగి గరళకూటకృపీటభవజ్వాలానష్టంభంబు సంస్తంభించి, త్రిపురదైతేయమదవతిగండభాగమకరికాపత్రభంగంబులు దొలంగించి భీమలింగంబు సర్వమంగళాదేవియుం దానును లోకరక్షణార్థంబుగా నధిష్ఠించియుండును. | 76 |