పుట:భీమేశ్వరపురాణము.pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్టివి కొన్ని మృగ్యంబులగు ప్రయోగంబు లీకావ్యంబునఁ గనఁబడినవి. ఆంధ్రలక్షణంబు దెఱంగుంబట్టి యివి లక్షణవిరుద్దంబులన సాహసింపము అఖండయతి యీకవికి సమ్మతము.

ఉత్తరభాగమునం దేకారణముచేతనో యీ గ్రంథము మిక్కిలి యజాగ్రత్తతో వ్రాయఁబడిన ట్లగపడుచున్నది. ఎట్లనిన:—

54-62 తీర్థముల పేళ్లును వరుసయుఁ గ్రమంబుగ లేదు.

85 వక్త యెవరయినదియు మఱచి వ్రాయఁబడి యున్నది.

106-వ ఫుట 67-వ పద్యమున “అయిదుతరముల పూర్వుల నవలమీఁద, నందఱను గాచు నూర్ధ్వలోకాలయముల” దీనికిమూలము “దశపూర్వాన్ దశాపరాన్” అని యున్నది. 10-కి 5 వేసినది సహజోక్తికిని విరుద్ధముగనున్నది.

117-వ పుట 157-వ పద్యము ప్రథమపాదమునఁ బాపములు ప్రబలు ననఁబడియె. 2-వ పాదమున పాపక్షయము పేర్కొనఁబడియె. పాపంబులెట్లు ప్రక్షయం బందునో వ్రాయఁబడియుండలేదు. మూలమున నీపట్టున “సత్సమాగమ మన్నామ కథాశ్రవణ యోగతః । పాపక్షయోభవేద్దేవి” అని యున్నది.

గ్రంథాంతమున యోగవర్జనముపట్ల మూలాతిక్రమణమును గ్రమభంగమును దండిగఁ గనఁబడుచున్నవి.

ఈ కవి వ్రాసిన గ్రంథములలో "వీథినాటకము" అనునది యొకటి పేర్కొని యున్నాముకదా? వీథియనునది దశరూపకములలో నొకటి. శ్రీనాథునకేని యాతని సమకాలికులకేని నాటకములు వ్రాయనేల బుద్ధిపుట్టకపోయెనో యది మిక్కిలి చింత్యము.

ఈకవి భాగవతము నాంధ్రంబున రచియించిన మహాకవియగు బమ్మెర పోతరాజునకు బావమఱంది యందురు. వేంకటగిరిరాజులకు మూలపురుషుఁ డగుచెవిరెడ్డి మొదలు పదవతరమునం బుట్టి రాజ్య మేలిన సర్వజ్ఞసింగమనాయని నతనికి ముందువాఁడైన సింగమనేనిని సందర్శించిన ట్లగపడుటచే నీతనికాలము క్రీస్తు 15-వ శతాబ్దము పూర్వార్ధములోనిది యనవచ్చును. భీమఖండము ప్రథమాశ్వాసము 31-వ వచనమువలన నీ కవినిఁ బాలించిన రెడ్లయాస్థానము రాజమహేంద్రవరమని యేర్పడుటవలనను నితఁడు తన గ్రంథముల నెల్ల రెడ్లకో వారివారికో యంకితమిచ్చి యుండుటవలనను నితని నివాసభూమి రాజమహేంద్రవర మనియె చెప్పవలసి యున్నది. శ్రీనాథుఁడును బోతనామాత్యుఁడును వేంకటగిరి సర్వజ్ఞ సింగమనాయని