పుట:భీమేశ్వరపురాణము.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

23-వ పుట 14-వ పద్యము (“అతని నిశ్వాసముల మాత్ర నౌనొకావొ, వేదములును జరాచరవిశ్వజగము.” . దీనికి మూలము “భవత్యపాఙ్గమాత్రేణ తస్యసర్వమిదంజగత్.”

45-వ పుట 18-వ వచనము. “వేదండవదనశుండాకాండచుళికితోన్ముక్తసప్తగోదావర సలిలధారాఝణత్కారబృంహిత బ్రహ్మాండగోళంబును” అను దానికి మూలము “సప్తగోదావరతట క్రీడాసక్తస్యశీకరైః। గజాస్యస్య కరోన్ముక్తై క్లిన్నమార్తాణ్డమణ్డలమ్.”

91-వ పుట 159-వ పద్యము “పుండరీకత్వక్ప్రకాండాతిమండిత, కటిమండలంబు”

దీనికి మూలము “పుణ్డరీకోద్భవ శిరోమాలికాహారశోభితమ్.”

ఇందుఁ బుండరీకశబ్దము తక్క దానియర్ధము సహితము భిన్నము.

ఇట్లున్నను నొక్కొక్క యెడమూలాతిక్రమణమె రసమును మిక్కిలి పోషించిన ట్లగపడును. సూర్యోదయాది వర్ణనములందును నీకవి నిజకవితాప్రాగల్బ్యము విపులముగఁ దెలిపియున్నాఁడు. వలయునేని 25-వ పుట 30-వ పద్యము. తే. సంజకెంపును దిమిరంపు జంపునలుపు, గమిచి బ్రహ్మాండభాండంబు గరము మెఱసెఁ, బరమపరిపాకదశవృంతబంధ మెడలి, పతనమగుతాటిపంటితోఁ బ్రతిఘటించి." యను దీనిం జూడుఁడు. ఇట్టివి కొల్లలుగనున్నయవి. కవన మెచ్చటనేగాని తడవికొనిన ట్లగపడదు. “ముగురం గూర్చిన ముండదైవమునకున్, మోమోట లేదో సుమీ” యను దానివంటి దేశీయములు మంచినీళ్లప్రాయముగ నీకవి వాడును. వేయేల? హరవిలాసమున “గప్పలు, గఱరనరట్కరరవర గట్టని యఱచెన్" అని కప్పలకూఁతలను గవిత్వమునఁ జేర్చివ్రాసిన యీ మహాకవి శైలి యిట్టిట్టి దనవలయునే?

ఇతనికి శైవపక్షపాతము మెండనుట యీతనిచే రచింపఁబడిన గ్రంథములవలననేకాక యీ భీమఖండమునందు శ్రీకూర్మము సర్పవరమునుంగూర్చి మూలమున రెండధ్యాయములు మిక్కిలి విపులంబుగ స్తుతిపాఠములతోడ వ్రాయఁబడియుండ నాంధ్రంబున నీ రెండుస్థలములు నొక్క పద్యమున (29-51) నొక్కొక్క పాదమున నతిసంక్షేపముగ వర్ణింపఁబడుటవలనను దెలిసికొననగును.

88. 137 ముజ్జగంబు
13. 90 ముజ్జగంబు
37. 120 ఎల్లన్ శిష్యుల
107. 77 సీమటు