పంచమాశ్వాసము
105
| బ్రహ్మవై సృజియింతు వొక్క గుణంబున విష్ణుండవై పాలింతు వొక్కగుణంబున రుద్రుండవై సంహరింతువు, సర్వభూతాంతరాత్మభావనా, పరమపావనా, నీవు చంద్రసూర్యాత్మదీధితివై యహోరాత్రస్వరూపంబున వర్తింతువు. పృథివ్యాపస్తేజోవాయురాకాశాది పంచభూతాత్మక జీవాత్మక స్వరూపంబున వర్తింతువు. సర్వభూతాత్మప్రవిష్టుండవు. సర్వేంద్రియగుణధారా, సర్వేంద్రియవర్జిత సర్వపర్వాత్మకరూపంబున సర్వంబు ననుభవింతువు. సర్వశక్త్యాత్మక సర్వభూతగుహాశయ యని నమోనమశ్శబ్దంబులతోడ నిన్ను శ్రుతులు సంస్తుతించు శుద్ధుండవు. బుద్ధుండవు. సుఖివి. సదానందుండవు. సదా ముక్తుండవు. మముఁబోటి కామిను లల్పబుద్ధులు మిముఁ బ్రస్తుతింపఁగలవారలా? క్షమియింపు. క్షమియింపుము. రక్షింపు రక్షింపు మగోచరచరిత్ర యగోచరబలాబల మహర్షియోగీంద్రులకు దుర్లభుండవు. సంసారి వసంసారివి. భవుండ వభవుండవు. మంగళుండ వమంగళుండవు. భుజంగభూషణా, నిన్ను నీవ యెఱుంగుదువు. సర్వాతీతుండవు. తాపసప్రియుండవు. తపోభ్యుండవు. నిజకర్మనిష్ఠులైన కర్మఠులు నిన్ను భజియింతురు. నీకుఁ బ్రణామంబులు సేయుదురు. జ్ఞానంబున నొండె నజ్ఞానంబున నొండె. నీ మహిమార్ణవంబున మునింగి దరిచేరం దెరువెఱంగక నీవే తక్క నితఃపరం బెఱుంగక మా యాత్మశుద్దికొఱకుఁ దోచినట్లు వర్ణించెదముగాని శక్తిగలిగి గాదు. దేవదేవ మహాదేవ దేవతాసార్వభౌమా దేవాదిదేవ దేవదేవేశ మహాలింగ తపోవిశేషంబునం బర్వతాత్మజ నీదేహంబున సగపాలుగొనియె. నీ దేవికి నమస్కారంబు. నీకు దండప్రణామంబు. కటాక్షింపుమని ప్రార్థించిరి. తదనంతరంబ యోసర్వమంగళా భువనేశ్వరీ సర్వమంగళదాయినీ నీకు మ్రొక్కెదము. మమ్ము రక్షింపుమని మహాదేవికిం గేలుదోయి నొసలిపయిం గీలించి యోమహాదేవ మహానుభావ శశాంకశేఖర నమస్తే నమస్తే నమః యని యనేకప్రకారంబుల స్తుతియించిన. | 53 |
చ. | వికటజటాకుడుంగమున వెన్నెలఱేని ధరించి వీనులం | 54 |
తే. | ఇట్లు ప్రాదుర్భవించి సర్వేశ్వరుండు, వరము లెన్నేని యాపతివ్రతల కొసఁగి | 55 |
వ. | అప్పుడు సమీపవర్తియగు బృహస్పతికి దివస్పతి యిట్లనియె. | 56 |
దివస్పతి బృహస్పతిని దానములఁ గూర్చి యడుగుట
క. | దాతృత్వము దానంబును, దాతవ్యం బనఁగ నెద్ది ధర్మవిధిజ్ఞా | 57 |