Jump to content

పుట:భీమేశ్వరపురాణము.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ కవిరచించిన గ్రంథములు మే మెఱింగినంతవఱకు నెవ్వియనిన:—

1. నవమరుత్తుచరిత్రము.

2. పండితారాధ్య చరితము; ఇది వేమారెడ్డి సేనానాయకుఁడైన మామిడి ప్రెగ్గడయ్యకు నంకితము.

3. శాలివాహనసప్తశతి.

4. నైషధము, ఇది వేమారెడ్డి సేనానాయకుని తమ్ముఁడైన మంత్రి సింగనకు నంకితము.

5. భీమఖండము; ఇది వీరభద్రరెడ్డి మంత్రియైన బెండపూఁడి యన్నామాత్యున కంకితము.

6. కాశీఖండము; ఇది వీరభద్రరెడ్డి కంకితము.

7. వీథినాటకము.

8. హరవిలాసము; ఇది వేమారెడ్డియొద్ద సుగంధ భాండాగారాధ్యక్షుఁడైయున్న సిరయాల తిప్పయ్య కంకితము.

9. పల్నాటి వీరచరిత్రము.

10. నందనందనచరిత్రము.

వేమారెడ్డియు, వీరభద్రరెడ్డియు నన్నదమ్ములు.

ఈ గ్రంథంబులు వ్రాయఁబడినవరుస కాశీఖండములోని యీ పద్యమువలన నొకింత తెలియును:—

సీ.చిన్నారిపొన్నారిచిఱుతకూఁకటినాఁడు, రచియించితిని మరుద్రాట్చరిత్ర
   నూనూగుమీసాల నూత్నయౌవనమున, శాలివాహనసప్తశతి నొడివితి
   సంతరించితి నిండుజవ్వనంబునను శ్రీ, హర్షనైషధకావ్య మంధ్రభాషఁ
   బ్రౌఢనిర్భరవయఃపరిపాకమునఁ గొని, యాడితిని భీమనాయకునిమహిమఁ
గీ.బ్రాయ మెంతయు మిగులఁ గైవ్రాలకుండఁ, గాశికాఖండమను మహాగ్రంధ మేను
   దెనుఁగుఁ జేసెదఁ గర్ణాటదేశకటక, పద్మవనహేళి శ్రీనాథభట్టసుకవి.

ఈ గ్రంథంబులు సంస్కృతజటిలంబులై ముద్దులుగుల్కుశైలిని సలక్షణంబగు భాషను వ్రాయఁబడియున్నవి. ఈ కవివ్రాయు సీసపద్యములు చూడఁ జూడఁ జవు లొలుకుచుండును.

ఈయనకవిత్వము మిక్కిలి రసవంతమనుటయం దీయనకుఁ గలిగియుండిన నమ్మకమునకుఁ గాశీఖండము కృతిభర్తయగు వీరభద్రరెడ్డి చెప్పినట్లు వ్రాయఁబడి