Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/656

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

రాకకు నెదుళ్లు సూచుచుఁ, బ్రాకటగతి నుండువారు పౌరులు ప్రీతిన్.

⁠ 2451


క.⁠

గిరులు వనంబులు నదులు ని, తరపురఖేటములు వేగ దాఁటఁగవలె నీ
తెరువు కడుదువ్వు నేఁ డిట, వరవిభవా కదలిపోవవలయును మాకున్.

⁠ 2452


వ.⁠

అనవుడు విభీషణుండు రామున కి ట్లను మీరు నేఁడ పూర్వప్రహారార్ధంబునన
యయోధ్యకు విజయంచేయునుపాయంబు గల దవధరింపుము.

⁠ 2453


చ.⁠

విపులబలుండు దైత్యకులవీరుఁడు తొల్లి రణంబునన్ ధనా
ధిపుని నుదగ్రతన్ గెలిచి తెచ్చిన పుష్పక మున్న దిక్కడం
దపనరథాతివేగ మది తార్క్ష్యుని మెచ్చదు కామగంబు నీ
విపు [1]డురురూఢి నెక్కి సుఖవృత్తి నయోధ్యకు నేఁగు మంచుఁ దాన్.

⁠ 2454


క.⁠

అంత రఘూద్వహుననుమతి, సంతసమున దైత్యరాజు చలదురుఘంటా
సంతతరవ ములియఁగఁ దదు, పాంతమున విమాన మునిచె నవ్విభుఁ డలరన్.

⁠ 2455


సీ.⁠

కమనీయపద్మరాగప్రభామండలి, బాలాతపస్ఫూర్తి బయలుపఱుప
లాలితహరినీలజాలాంశుపటలంబు, గలయంగ దెసలఁ జీఁకట్లు గొలుప
రమణీయచంద్రకాంతమణిప్రభావలి, నిండువెన్నెలవెల్లినిగ్గు లుమియ
మరకతరత్నాంశుమంజరీసంహతి, రవితురగవ్యక్తిరచన చూప
వజ్రవైడూర్యమౌక్తికావలులరుచులు, వరుస దిగ్భిత్తితటములు వన్నె వెట్ట
రజతసౌవర్ణవేదికావ్రజము శార, దాభ్రములమీఁదిమెఱుపుల నలమి కొనఁగ.

⁠ 2456


వ.⁠

మఱియు గగనమహోరగనిర్ముక్తనిర్మోక[2] పట్టచ్ఛేదలలితంబు లగుకేతనంబు
లును సుధాకరుకరంబులం గూడఁబెట్టి యమృతంబునం గసటువోఁ గడిగి విరచి
తంబు లైనయట్లు శోభిల్లుచు [3]పినద్ధంబు లైనచామరంబులును మయూరాధిష్ఠి
తంబు లగురోహణగిరిసానుతలంబులం బోలు విచిత్రాస్తరణంబులు గలవేదిక
లును దదీయరచనావిశేషవిస్మితు లయి కదలక చూచుచున్నయచ్చర లనం బొ
లుచుమణిసాలభంజికలసొం పారురత్నస్తంభంబులును విద్యుత్సహస్రంబులు దె
చ్చి గట్టిపఱిచి తేటపడ రచించి రన నొప్పు మిగులుకనకకుట్టిమంబులును సుర
ధనుశ్శతంబులు గరఁగి నిర్మించినట్లు విలసిల్లువివిధమణిభిత్తులును గలిగి సమా
సద్ధఘంటాసహస్రగంభీరఘోషతిరస్కృతజీమూతగర్జితంబును నై విశ్వకర్మ దన
నేర్పు మెఱయఁ జేసినపుష్పకంబుఁ జూచి సంతసిల్లి రఘునాయకుండు సుగ్రీవా
దులం జూపి రావణావరజున కి ట్లనియె.

⁠ 2457


చ.⁠

తడయక వీరిలావున నుదారగతిన్ జలరాశి గట్టి పెం
పడరఁగ దాఁటి యుద్ధతి వియచ్చరు లచ్చెరు వంద లంక పై
విడిసి నిశాటకోటి భుజవీర్యమునం దెగటార్చి రావణున్

⁠
  1. ↑ విపుడు నిరూఢి... నేఁగు మీశ్వరా.
  2. ↑ 'పటలతులితంబు లగుపక్షచ్ఛదకేతనంబులును' అ. ప్ర.
  3. ↑ నవంబు లైనచామరంబులును