| |
న్ధీమహితాత్ములం గనుము నీ వని దీవన లిచ్చె నత్తఱిన్.
| 2431
|
ఇంద్రునివరంబున మృతవానరులు పునర్జీవితు లగుట
| చ. |
అనునెడ నింద్రుఁ డిట్లనియె నంబుజలోచన నీవు మాకుఁగా
మనుజుఁడ వై జనించి యతిమానుషశక్తి వహించి పోరులన్
దనుజులఁ ద్రుంచి మాతగుపదంబులు వేడ్కఁ దిరంబు సేసి జీ
వనములు నిల్పి కాచితివి వారిజబాంధవవంశవర్ధనా.
| 2432
|
| సీ. |
నీనిమిత్తంబున నిర్జరావలిఁ గూడి, నాకాధిపత్యంబు నాకుఁ గల్గె
నీప్రభావంబున నెఱి హవిర్భాగంబు, లంచితస్థితి సంభవించె నాకు
నీప్రసాదంబున నిఖిలదిక్పతులును, దమతమరాజ్యపదములు గనిరి
నీదయామృతదృష్టి నిగిడిన నిక్కంబు, పాతాళవాసులు బ్రదికి రెలమి
మాకు నెంతయు సమకూరె మంగళంబు, తోయజాక్షులతోఁ గూడి తొంటిపగిది
గలిగెఁ గ్రీడింప నెమ్మది నెలమి మిగులు, [1]నీవ శరణంబు రాఘవ నిక్క మరయ.
| 2433
|
| వ. |
పరిపూర్ణసుగుణాభిరాముండును నిష్కాముండును బూరితభక్తమనోరథుండును
జగన్నాథుండును జనార్దనుండు నగు నీకు వరంబు లిచ్చెద నంగీకరింపు మ
నుట [2]బేలతనం బయినను నీకుం బ్రియంబు లయినవాని నడుగు మిచ్చెద ననిన
రామచంద్రుం డి ట్లనియె.
| 2434
|
| చ. |
నెఱయఁగ నీప్రసాదమున నిర్జరలోకలలామ నాకు నే
కొఱఁతయు లేదు కోరఁ దగుకోర్కియు నెద్దియుఁ గాన నైననా
కొఱకు రణంబునందుఁ గపికుంజరు లీల్గినవారు వీరలన్
మఱలఁగ వేడ్క నిచ్చుటయ మన్నన దీనన సంతసిల్లుదున్.
| 2435
|
| చ. |
కపివరు లున్నచోట్లఁ గలకాలము నెందు ఫలించి వన్యపా
దపములుఁ గందమూలములుఁ దద్దయు నొప్పఁగఁ బద్మవిస్ఫుర
ద్విపులసరోవరంబులు నదీనదముల్ దనరారునట్లుగాఁ
గృప [3]దళుకొత్త నిమ్ము నవగీతమహోదయ విస్ఫురద్దయా.
| 2436
|
| తే. |
ఇనకులోత్తముపలుకులు విని సురేంద్రుఁ, డంతరంగంబులోపల సంతసంబు
నిండి దైవాఱ నంబుదనినద మొదవు, భంగి ని ట్లని రాఘవుఁ బలికె నంత.
| 2438
|
| ఉ. |
ఘోరరణంబులోనఁ బడి కూలినవానరు లెల్ల యోగని
ద్రారతిఁ బొంది నెమ్మదిఁ బదంపడి మేల్కనుభంగిఁ [4]బ్రాక్తను
స్ఫారబలంబులం దనరి ప్రాణములం దగ నొంది యుద్ధత
స్మేరత నెంతయున్ మిగిలి చేవఁ దలిర్తురుగాక యెమ్మెయిన్.
| 2439
|
- ↑ నీవ రాఘవ శరణంబ వెల్ల నాఁడు.
- ↑ బేలుఁదనంబు- బెలుచఁదనంబు
- ↑ దిలకించి యి మ్మనపరీతమహోదయవిస్ఫురద్దయన్.
- ↑ బ్రాప్తసంస్ఫారబలంబులం