Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/652

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రవ మొందం గరణీయ మేది నయ మారం జెప్పుఁడా చేసెదన్.

2411

శివుఁడు రాముని స్తుతించుట

వ.

అనిన.

2412


ఆ.

రాజతాచలైకరాజితనిలయుండు, రాజరాజసఖుఁడు రాజమౌళి
రాజమౌళి యైనరాజీవహితవంశ, రాజమానుఁ డైనరాముఁ బలికె.

2413


క.

నీకు సరి గలరె రాఘవ, లోకపరిత్రాణభరణలోలుఁడవు పర
శ్లోకచరిత్రుఁడవు సురా, నీక భయాపహృతిమాననీయుఁడ వెందున్.

2414


చ.

సురలకు గుండెతల్లడము [1]శూరులడెందములోనికొఱ్ఱు ఖే
చరతతికంటిలో[2]నలుసు సాధ్యులకొంగున నున్నచిచ్చు భూ
సురులకు నెల్లనాఁడు మెడఁ జుట్టినపాము మునీంద్రకోటిపైఁ
బొరిఁ బడ నున్నయాపిడుగుఁ బొల్పఱఁ జేసితి వీవు రాఘవా.

2415


వ.

కుంభకర్ణమేఘనాదాతికాయమహాకాయాదు లగుమహాసురుల [3]నసంఖ్యేయు
ల నజేయులం దెగటార్చి ప్రాజ్యం బగుస్వారాజ్యంబు నిష్కంటకంబు గావించి
సకలభువనంబులు నిరాతంకంబులుగాఁ బావనంబులు సేసి తింక నీవు కృతకృ
త్యుండవు కరణీయవిశేషం బెద్దియు లే దయినను జేయవలయునది యెయ్యది
యనిన భవజ్జనని యైనకల్యగుణసాకల్య యగుకౌసల్యయు నీకుఁ బరమభక్తుం
డు ననురక్తుండును శుభచరితుండు నగుభరతుండు నాతనిజనయిత్రి యైనకేకయ
రాజపుత్రియు భవద్వనవాసైకసహచరుండును రణాగ్రచరుండును నగులక్ష్మణు
తల్లి పోషితమిత్ర యైనసుమిత్రయు వీరశత్రుఘ్నుం డగుశత్రుఘ్నుండు నితరబం
ధువర్గంబులు నీదర్శనంబుఁ బ్రతీక్షించుచున్నవారు గావునం బరాయోధ్య య
గునయోధ్య కరిగి వారల యథాక్రమంబున సంభావించి సకలప్రధానప్రజాను
రంజనంబుగా రాజ్యంబు సేయుచు హయమేధముఖంబు లగుమఖంబు లనేకంబు
లు నిర్వర్తించి సముచితదక్షిణాప్రదానంబుల మహీసురులం దనిపి సుఖంబు
లనుభవింపు మని మఱియు ని ట్లనియె.

2416


క.

నీజనకుఁడు దశరథుఁ డదె, నీజయమున కాత్మ మెచ్చి నిర్జరతతిచేఁ
బూజితుఁ డై వరపుష్పక, రాజితుఁ డై వచ్చినాఁడు రాఘవ కంటే.

2417


క.

ముదమున సావరజుఁడ వై, మది నుల్లాసంబు నిగుడ మహితస్థితి న
భ్యుదయమ్ము నెదుర్కొనుగతి, సదయుని దశరథునిఁ గనుము సదమలచరితా.

2418


క.

అనినన్ భక్తిముదంబులు, పెనఁగొనఁ బులకించి మించి పెరిఁగినకడఁకన్
జనవిభుఁడు సానుజుం డై, జనకునకు నమస్కరించె సంభ్రమలీలన్.

2419


వ.

నందనద్వయంబును దనకుఁ బ్రణామం బాచరించినం దిగిచి గ్రుచ్చి కౌఁగిటం

  1. 'సూరులడెందము' అ. ప్ర.
  2. కసవు
  3. 'అజేయుల' ననియే శక్యార్థమునఁ గవి ప్రయోగించియున్నాఁడు.