Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/639

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బోర వధించి నిన్నుఁ గొనికిపోవఁ గలం డని మున్ను నీకు నే
ధీరతతోడఁ జెప్పిన ప్రతిజ్ఞలు వచ్చెఁ జుమీ మహీసుతా.

2294


వ.

అనునయ్యవసరంబున.

2295


ఉ.

వేదనఁ బైపయిం దొరఁగువెచ్చనికన్నులనీరు సాంద్రస
మ్మోదము కల్మిఁ జల్లనయి మున్కొని క్రమ్మఁ గృశాంగయష్టియున్
మేదుర మై తనర్పఁగ సమీహితరోమసముద్గమంబున
న్మేదినిపట్టి రామవిభు నెమ్మదిలో నెలకొల్చి సోలుచున్.

2296


క.

కపివీర నీవు చేసిన, యుపకారంబునకు సామ్య మొదవంగాఁ బ్ర
త్యుపకృతి సేయఁగఁ దరమే, విపులత్రిజగత్ప్రదానవిధులును సరియే.

2297


చ.

పతిహితముం బ్రతాపము నుపాయము శౌర్యము ధైర్యమున్ సమీ
హితకరణక్షమత్వము నహీనజవంబుఁ బరాక్రమంబు నం
చితవినయంబు నీతియు వశిత్వముఁ దేజము నీక యొప్పు మా
రుతసుత నీకు ధారుణి నొకరుల్ సరివత్తురె వారి మెత్తురే.

2298


సీ.

నీకతంబునఁ గాదె నృపకులాధీశ్వరుం, డెలమి నావృత్తాంత మెల్లఁ దెలిసె
నీప్రసాదమునఁగా నెరయంగ సౌమిత్రి, ప్రాణముల్ భూపతి పడయ నేర్చె
[1]నిండి దైవాఱిన నీదయచేతఁగా, పరఁగ నేఁ జావక బ్రతికి యుంటి
దుస్తరం బైనపాథోరాశి యెవ్వఁడు, నీవు దప్పఁగ దాఁట నేర్చువాఁడు
రమణ నీ వనుయానపాత్రమునఁ జేసి, భూతలేశ్వరుఁ డాపదంభోధి దాఁటె
నెన్ని చూచిన నీఋణ మెట్లు దీరు, ఘనయశోధామ మా కేడుగడయు నీవ.

2299


వ.

అనిన హనుమంతుండు లజ్జావినయవినమితుం డై యి ట్లనియె.

2300


శా.

తల్లీ మీ రిటు లాన తిత్తురె భవద్దాసుండ మీయాజ్ఞ నే
జెల్లింపంగలవాఁడ మీయభిమతశ్రీ కింత [2]పాత్రుండ ను
త్ఫుల్లత్సత్క రుణుండు భూవిభుఁడు నన్ బొల్పార మన్నించుచోఁ
దెల్లం బైనబలంబునం బరఁగితిం దేజంబునం బేర్చితిన్.

2301


తే.

పుణ్యభాగిని భవదీయభూరిశుద్ధ, మహితసాధ్వీత్వసుచరిత్రమహిమఁ జేసి
పరఁగ నెల్లెడ శుభము లప్రతిహతంబు, లయ్యె నిక్కువ మంభోరుహాయతాక్షి.

2302


వ.

అని తత్సమీపంబున నతిభయంకరాకారలు నతివిశంకటదంష్ట్రావికటవదన
లు సతివృత్తోన్నతస్తిమితతారలోహితకపిలాదివర్ణనేత్రలుఁ బరుషతర్జనవచనలు
నగురాక్షసాంగనలం జూచి కోపించి యుగ్రాకారుం డై యి ట్లనియె.

2303


చ.

పెలుచనినిన్నుఁ జేరి వెఱపించుచు నూరక యెగ్గు లాడుచుం
గొలఁదికి మీఱ నుగ్రగతిఁ గ్రొవ్వునఁ బాపము నాక చంపఁగా

  1. నిండఁ బైఁ బాఱిననీకృపామృతమునఁ బరఁగ
  2. పాత్రుండనే, ఫుల్లాంతఃకరణుండు భూవిభుఁడు