Jump to content

పుట:భాస్కరరామాయణము.pdf/607

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లాలోలస్థితి నెంతయుం దనరె వేల్లద్విక్రమప్రక్రియన్.

2023


వ.

అట దశముఖుండు దైవతాస్త్రంబు ప్రయోగించిన.

2024


చ.

మలయుచుఁ బెక్కుచందముల మండుచు మ్రోయుచు ధూమజాలకం
బులు గలిగించుచున్ వడి నభోవలయంబున నిండి పర్వుచున్
దలముగ విస్ఫులింగము[1]లతానక మై చనుచేర రాఘవుం
డలయక దాని నేసి యనయంబును శాంతము సేసె గ్రక్కునన్.

2025


వ.

మఱియును రావణుండు గాంధర్వాస్త్రం బేసిన.

2026


మహాస్రగ్ధర.

అదియున్ సాంద్రాంధకారవ్యతికరభయదం బై చలద్ధూమరేఖా
విదితం బై కాలజిహ్వావిపులభయద మై విస్ఫురత్కాలమేఘా
స్పద మై విభ్రాంతినిద్రాభరపరవశతాపాది యై యేఁగుదేరం
బదిలుం డై రాఘవుండుం బ్రతివిశిఖమునం బ్రచ్యుతిం బొందఁజేసెన్.

2027


క.

అక్షతపౌరుషనిధి హ, ర్యక్షపరాక్రముఁడు మహదహంకృతితోడన్
రాక్షసబాణం బేసెను, రాక్షసకులవల్లభుండు రామునిమీఁదన్.

2028


ఉ.

మీఱినకోఱలున్ మిగిలి మింటికిఁ బర్వినపల్లవెండ్రుకల్
తేఱినమిట్టగ్రుడ్డులు [2]నుదీర్ణతరం బగునట్టిసాహసం
బాఱనితేజమున్ దెసల నంటినచేతులు లోకరాజిలో
నేఱినమేటిరూపముల నెంతయుఁ బేర్చిరి రాక్షసుల్ వడిన్.

2029


వ.

అంత.

2030


శా.

నిష్కంపప్రథితానుభావుఁడు ధనుర్నిష్క్రాంతమౌర్వీరవా
విష్కారంబుగ వైష్ణవాస్త్ర మసుహృద్విభ్రాంతిగా నేసె శో
చిప్కేశుండు శిఖాగ్రచుంబితవియత్సీమంతుఁ డై మండ ధా
నుష్కాగ్రేసరురూఢిఁ జూపుచు రణానుష్ఠానశిక్షారతిన్.

2031


వ.

అయ్యస్త్రంబుచేత నాసురాస్త్రతేజంబు తరణికిరణంబులచేత నంధతమసంబు
వాయుపగిదిం బ్రతిహతం బైన.

2032


క.

శుష్యన్నిలింపముదముగఁ, బుష్యద్రజనీచరేంద్రభూరిరవుం డై
హృష్యత్పులకాంచితుఁ డై, దూష్యాశయుఁ డహిశరంబు దొడిగినమాత్రన్.

2033


సీ.

వెలరారుపొగగలవిషములు గ్రక్కుచు, ఫూత్కారనాదముల్ పొలుపు మిగులఁ
దఱచుగా ఘోరనేత్రముల మంటలు గ్రమ్మఁ, జూడామణిప్రభల్ చుట్టుముట్ట
భీకరదుర్గమానేకముఖములతో, వాసుకిభోగభావంబు లగుచు
[3]నిశితదంష్ట్రాకోటి నిష్ఠురత్వంబుగఁ, దార్క్ష్యుని బెగడించుదలము గలిగి
దెసలు నంబరంబుఁ దెఱపి లేకుండంగఁ, గప్పె భుజగతతులు గరుడకేతుఁ

  1. లతావలమై చనుదేర
  2. ను దిగ్మతరం బగునట్టహాసమున్, ఆఱని
  3. నిశితదంష్ట్రారాతి నిష్ఠురత్వంబులఁ, దార్క్ష్యుని భేదించు తలము