| | స్ఫోటన దాఁటుచుం జెలఁగుచుం బొరి నూఱులు వేలు లక్షలుం | 237 |
| క. | వడి వైచుడు నంబుచ్ఛట, లుడుమార్గము గడవ నెగయ నుగ్రధ్వనితోఁ | 238 |
| తే. | మరలి జననాథుపాలికి నరుగుదెంచి, దేవ నిమ్నగావిభుఁ డన్నతెఱుఁగు గాక | 239 |
| క. | అని విన్నవించుసమయం, బున నవ్విభుతో నదీవిభుం డి ట్లను నీ | 240 |
| ఆ. | మొదట నొక్కతరువు మునిఁగిపోవక యుండ, నితఁడు వైవఁ బిదప నెల్లవారుఁ | 241 |
| క. | ఇంతకు మును వైచినయని, యంతర్గ్రాహములు మ్రింగె ననవుడు నబ్భూ | 242 |
| క. | తిమి యన శతయోజనమా, త్రము గల దొకమీను దాని రఘువర యొకమీ | 243 |
| క. | [2]అయినను నంతంతకు న, మ్మెయి నుగ్రగ్రాహకులము మెలఁగఁగ నీపై | 244 |
| వ. | అనిన నవ్యాక్యంబులకు సంతోషించుచుఁ బ్లవంగపుంగవు లార్పులు నింగిఁ జెలంగ | 245 |
వానరులు సేతువు గట్టుట
| శా. | విఘ్నేశాయ నమోనమో భగవతే శ్రీ వేదండతుండాయ ని | 246 |
| ఉ. | వైచిన నాకలోకమున వారికి వారిధిపంపు పూని దో | 247 |