పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


జాతీయ కాంగ్రెస్‌ కలకత్తా నగరంలో జరిపిన సమావేశాలకు బీబీ అమ్మ హాజరయ్యారు. ఈ సమావేశంలో, స్వేచ్ఛా-స్వాతంత్య్రాలకోసం హిందూ-ముస్లింలు కలసి మెలసి పోరాడలని పిలుపునిస్తూ, ఐక్యత ద్వారా మాత్రమే భారతీయులు స్వేచ్ఛ పొందగలరని ఉద్ఘాటించారు. జీవన ప్రయాణంలో భగవంతునికి తప్ప మరెవ్వరికీ తలవంచేది లేదాన్నారు. భారత ప్రభుత్వ కార్యదర్శిని కలిసే ప్రతినిధి బృందంలో చేరాల్సిందిగా ఆమెకు ఆహ్వానం వచ్చింది. ఆ ఆహ్వానాన్ని ఆమె తిరస్కరిస్తూ పరాయి పాలకుల వద్దకు నేను బిచ్చగత్తెగా రాలేనని అన్నారు. 1917డిసెంబరులో కలకత్తా నగరంలో జరిగిన అఖిల భారత ముస్లిం లీగ్ మహాసభలకు హాజరైన ఆమె, హిందూ-ముస్లింల ఐక్యతావశ్యకతను వివరిస్తూ ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. ప్రజలు మత విద్వేషాలను విడనాడి ఇస్లాం ప్రబోధించిన, మహమ్మద్‌ ప్రవక్త చూపిన శాంతి-సామరస్య మార్గాన ప్రయాణించాలని ముస్లింలను కోరారు.

ప్రపంచ ముస్లిములు ధార్మికంగా గౌరవించే ఖలీఫా పదవిని బ్రిటిష్‌ ప్రభుత్వం రద్దు చేయటంతో రగిలిన ఆగ్రహజ్వాలల ఫలితంగా ఇండియాలో రూపుదిద్దుకున్న ఖిలాఫత్‌ ఉద్యమం లో ఆబాది బానో క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ సందర్బంగా అరెస్టులను, అవరోధాలను ఆమె లెక్కచేయలేదు. ఆమె కుటుంబ సభ్యులంతా ఖిలాఫత్‌ ఉద్యమానికి పూర్తిగా అంకితమయ్యారు.అనర్గళ ప్రసంగాలతో, నిస్వార్ధం, నిబద్ధతతో కూడిన త్యాగమయ జీవిత విధానంతో, లక్ష్య సాధన పట్ల పరిపూర్ణ అంకిత భావంతో వ్యవహరిసూ, ప్రజలను ఆకట్టుకుని జాతీయోద్యమ దిశగా ఎందరినో కార్యోన్ముఖులను చేశారు. మాతృదేశం కోసం మరణంచటం కూడ అప్పుడప్పుడు అవసరం. అయితే మరణంచటం కంటే లక్ష్యసాధన కోసం జీవించటం చాలా అవసరం అంటూ ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు ప్రజలను అశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆమె స్త్రీ విద్యకు, హిందూ- ముస్లిముల ఐక్యతకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రసంగాలు చేశారు. ఖిలాఫత్‌ ఉద్యామంతోపాటుగా, గాంధీజీ రూపకల్పన చేసిన సహాయనిరాకరణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. ఈ సందర్బంగా ఆమె ఖిలాఫత్‌ సమస్య కోసం మీ జీవితాలను త్యాగం చేయండి అంటూ నినదించారు. ఈ నినాదం ఆనాడు ప్రతి ఉద్యామకారుడ్నిఖిలాఫత్‌-సహాయనిరాకరణ ఉద్యమదిశగా పురికొల్పింది.('Sacrifice your life on the issue of Khilafath ' - Enclopaedia of Women Biography, Volume 96