పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



అంగీకరించరు. ఒక వేళ అంగీకరిస్తే నిస్సందేహంగా అటువిం బిడ్డల గొంతును నేనే స్వయంగా పిసికి చంపేస్తాను. ఈ మహత్తర కర్తవ్య నిర్వహణకు భగవంతుడు ఈ వృధురాలి హస్తాలకు అంత శక్తిని తప్పక ఇస్తాడు అని ఆమె గర్జించారు. ఆమె అంతటితో ఆగలేదు. ' ఈ విషయాలను మా సమాధానంగా, మీ ప్రతిపాదానలకు మా తిరస్కారంగా ప్రబు త్వానికి తెలియచేయండి' అని ఆబాది బానో పోలీసు ఉన్నతాధికారులను కోరారు. మాతృభూమి సేవ చేసు కునేందుకు భగవంతుడు ప్రసాదించిన మహతర భాగ్యాన్ని ఎటువంటి అవాంతరాలు ఎదురైనా మరెన్ని కష్టనష్టాలు కలసివచ్చి పడినా వదలుకునేది లేదని ఆమె నిర్ద్వందంగా ప్రకటించారు. (Bharath Ke Swatantra Samgram me MusŒ lim Mahilavonka Yogdan, Page. 61-63)

1917లో ఆబాది బానో మొట్టమొదటిసారిగా గాంధీజీని కలిసారు. ఆ తరువాత అలీ సోదారులకు గాంధీజీకి మధ్యన ప్రగాఢ స్నేహబంధం ఏర్పడింది. అలీ సోదారులతో పాటుగా తనను కూడ ఆమె కన్నబిడ్డలా చూసుకున్నారని గాంధీజీ తన యంగ్ ఇండియా పత్రికలో, మిత్రులకు రాసిన లేఖలలో స్వయంగా పేర్కొని ఆమె పట్ల గౌరవభావాన్ని ప్రకటించారు. అంతేకాదు అలీ సోదరు లతో కలసి ఆమెకు తాము ముగ్గురు కుమారులమని గాంధీజీ అన్నారు. ఆమె అభిప్రాయాలకు ఆయన అత్యంత ప్రాముఖ్యత నిచ్చారు.

95