పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్


పతాకాన్ని ధరిస్తాను, ఇదేదో ప్రదర్శనకు కాదు, నా ఆశయాలు,అభిప్రాయాలను వ్యక్తం చేయటంలో ఏమాత్రం సిగ్గుపడాల్సింది లేదనడానికి మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. ఒక్క పతాకాన్ని పోలీసులు ధ్వంసం చేస్తే ఏమౌతుంది. వందల వేల పతాకాలు ప్రతి ఉద్యమకారుడి ఇంట రెపరెపలాడుతాయి అని ఆమె బ్రిటిషు పోలీసులకు సవాల్‌ విసిరారు. (Bharath Ke Swatantra Samgram me Muslim Mahilvonka Yogdan , Dr.Abida Samiuddin, IOS, New Delhi,1997, Page. 55-59) ప్రథమ ప్రపంచ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఉద్యమకారులను అణిచి వేసేందుకు బ్రిటిష్‌ ప్రభుత్వం తెచ్చిన ఇండియన్‌ డిఫెన్స్‌ రెగ్యులేషన్స్‌ స్వాతంత్య్ర సమర యోధుల పాలిట ప్రాణాంతకమై నాయి. బ్రిటిష్‌ ప్రభుత్వం పోకడలను నిరససు న్నమౌలానా ముహమ్మద్‌ అలీ బ్రిటిష్‌ పాలకుల మీద చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలను పురస్కరించుకుని అలీ సోదరులను చిందన్‌వాడ గ్రామంలో నిర్బంధించి, ఆ ఊరు దాటి వెళ్ళరాదని ప్రబుత్వం ఆంక్షలు విధించింది. ఆ సందర్బంగా ఆమె కూడ స్వచ్చందంగా అలీ సోదరులతో కలసి చిందాన్‌వాడ వెళ్లారు. ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూనే తన దేశం కోసం, జాతి జనుల కోసం నిర్భందాలను భరించాల్సిరావటం నిజంగా భగవంతుడిచ్చిన వరంగా ఆమె భావించారు. ఈ సందర్బంగా మాతృదేశం, జాతి జనుల కోసం కషనష్టాలను భరించేందుకు భగవంతుడి ఎంపిక (తన బిడ్డలను ఎంపిక చేయడం) నిజంగా గర్వించదగిన విషయం అని ఆమె ఆనందం వ్యక్తంచేశారు.

అలీ సోదారులు నిర్భంధంలో ఉండగా బ్రిటిషు ప్రభుత్వం అలీ సోదరుల వద్దకు లొంగుబాటు ప్రతిపాదన పంపింది. ఆ ప్రతిపాదాన ప్రకారంగా అలీ సోదరు లు ప్రబుత్వానికి బేషరతు లొంగిపోవాలి, భవిష్యతులో రాజకీయాలలో పాల్గొనరాదు. ఆ ప్రతిపాదన తెచ్చిన పోలీసు ఉన్నతాధికారి లొంగుబాటు పత్రంలోని అంశాలను అలీ సోదరులకు తెలుపుతున్నప్పుడు పక్కగదిలో కూర్చోని ఆమె విషయం తెలుసుకున్నారు.ప్రభుత్వం ప్రతిపాదానలు విన్నాక పర్దా ధరించి అలీ సోదరులు, ప్రభుత్వాధికారులు కూర్చోని ఉన్న గదిలోకి విసవిసా వచ్చారు. గదిలోకి వచ్చి రాగానే, పోలీసు ఉన్నతాధికారితో నేరుగా మాట్లాడుతూ నా బిడ్డలు స్వేచ్చను కోల్పోయేందుకు ఇష్టపడరు. ప్రబుత్వప్రతిపాదనలను అంగీకరిస్తే మా వెతలన్నీ తీరుతాయి. ఆ వెతల నుండి విముక్తి కోసం, మా ధార్మిక విలువలకు, మా దేశ ప్రయోజనాలకు విరుధంగా నా బిడ్డలు ప్రభుత్వ ప్రతిపాదానలను

94