పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌

గుర్తుపట్టగలగటంతో, తన మరిది కుమారుని ద్వారా రహస్యంగా ఉర్దూ పుస్తకాలలోని కథలను చదివి విన్పించుకుని, ఉర్దూ అక్షరాలను గుర్తుపడుతూ ఉర్దూ భాషతోపాటు పర్షియన్‌ భాషను కూడ నేర్చుకున్నారు. ఈ భాషలను చదవటం తప్ప రాయటం ఆమెకు కుదరక పోయినా, సృజనశీలి అయిన ఆమె కదలల్లటంలో మంచి నేర్పును సాధించారు. ( ' She had learned Quran as a child and thus knew the Arabic script in a rudimentary fashion. She taught herself to read Urdu by asking a nephew to read to her from a book of stories, committing it to memory, and reading them it herself,partly from memory and partly by sounding out the letters--since the script for Persian and Urdu is only slightly different from that of Arabic, She could read, therefore, and in addition was a great story teller, but never learned to write '. Secluded Scholars, Gail Minault, OUP, New Delhi, 1999, Page. 26)

ఆబాది బానో 27 సంవత్సరాల వయస్సులో భర్తను కోల్పోయారు. ఆనాటికి ఆమె ఐదుగురు మగపిల్లలు, ఓ ఆడపిల్లకు తల్లి. పునర్వివాహం చేసు కోవాల్సిందిగా బంధు మిత్రులు సలహా ఇచ్చారు. ఆ సలహాలను కాదాంటూ బిడ్డలను ప్రయోజకులుగాతీర్చిదిద్దేందుకు తన్నుతాను అంకితం చేసుకున్నారు. ఆమె తన పేరును ఎక్కడ ప్రస్తావించాల్సి వచ్చినా అబాది బానొ అబ్దుల్‌ అలీ బేగం అని భర్త పేరుతో కలిపి రాయటం భర్త పట్ల ఆమెకు గల ప్రేమానురాగాలకు చిహ్నం ఆ కారణంగా పునర్వివాహం గురించి తన వద్ద మరెవ్వరూ ప్రస్తావించరాదని బంధువులను వారించారు. బిడ్డల భవిష్యత్తు మీద దృష్టి సారించి, వారిని దేశభక్తులుగా, ధార్మిక నిష్టాగరిష్టులుగా, ప్రఖ్యాతి గాంచిన మేధావులుగా రూపొందించటంలో కృతకృత్యులయ్యారు.

ఆనాటి ముస్లిం సమాజంలోని సామాజిక-ధార్మిక బంధనాలకు భిన్నత్వంగా మారుతున్న కాలానుగుణంగా బిడ్డలకు మంచి చదువు చెప్పించాలని ఆమె నిర్ణయించారు. పరు గులెత్తు తు న్న కాలాన్నిబట్టి మారనట్టయితే బ్రతుకు పోరాటంలో వెనుకబడి పోతామన్నభావనతో తన బిడ్డలకు సాంప్రదాయ-ధార్మిక విద్యతోపాటుగా ఆధునిక ఆంగ్ల విద్య గరిపారు. ఆనాటి ప్రసిద్ధ అలీఘర్‌ విద్యాలయంలో చదువు చెప్పించారు. స్వదేశంలో విద్యాభ్యాసం తరువాత ఉన్నత విద్యకోసం బిడ్డలను ఇంగ్లాండ్‌ పంపారు. ఈ విధంగా ఆమె ఉన్నత విద్యకోసం బిడ్డలను విదేశాలకు పంపిన రాంపూరు నగరంలోని తొలి మహిళయ్యారు. భారత జాతీయోద్యామ చరిత్రలో అలీ సోదారులు గా ప్రఖ్యాతి చెందిన మౌలానా షౌకత్‌ అలీ, మౌలానా ముహమ్మద్‌ అలీలు ఆమె బిడ్డలు.

92