పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశస్వాతంత్య్ర పోరాటంలో వారు నిర్వహించిన అసాధారణ భూమిక గురించి సమాచారం నేటి సామాన్య చరిత్ర పుస్తకాల్లో దాదాపుగా అలభ్యం అనే చెప్పాలి. అందుకు కారణాలు ఏమైనా గాని, స్త్రీల పట్ల వివక్ష వల్ల ఇలా జరిగినా లేక మరే విధమైన వివక్షలు దీని వెనుక ఉన్నాగాని, స్వాతంత్య్రపోరాటంలో స్త్రీలు పోషించిన పాత్ర గురించి ముఖ్యంగా ముస్లిం స్త్రీలు పోషించిన పాత్ర గురించి నేడు సమాచారం దాదాపుగా మృగ్యం.

ఈ పరిస్థితుల్లో దేశం కోసం సర్వస్వాన్ని అర్పించిన ఆ త్యాగమూర్తుల గురించి వివరాలను అనేక వనరుల ద్వారా సేకరించి రచయిత మన ముందు ఉంచారు. ముఖ్యంగా గాంధీజీ రాసిన ఉత్తరాలు, యంగ్‌ఇండియా, నవజీవన్‌ పత్రికల్లో ఆయన రాసిన వ్యాసాల్లో వచ్చిన ప్రస్తావనలు, ఈ మహిళామణుల దేశభక్తిని మెచ్చుకుంటూ ఆయన రాసిన ప్రశంసా వాక్యాలు, పలు ప్రామాణిక చారిత్రక గ్రంధాలలో వచ్చిన ప్రస్తావనలు, బ్రిటీషు రచయితలు చేసిన వ్యాఖ్యలు, స్వాతంత్య్రపోరాట యోధుల కుటుంబ సభ్యులతో వ్యక్తిగతంగా జరిపిన చర్చలలో వెల్లడైన సమాచారం, పలు చరిత్ర గ్రంథాలలో, ఆత్మ కథలలో అక్కడక్కడా రచయితలు పేర్కొన్న వివరాలు తదితర వనరుల ద్వారా ఈ పుస్తకానికి అవసరమగు విషయ సామగ్రిని సేకరించడానికి రచయిత చేసిన ప్రయత్నం ప్రశంసించదగ్గది.

జాతీయోద్యమంలోని ఆగ్రనాయకత్వం మెప్పు పొందిన ఈ ముస్లిం మహిళలు ఎలాంటి స్వాతంత్య్రకాంక్షను హృదయాల్లో నింపుకుని పోరాటాల్లో పాల్గొన్నారో ఊహించడం కష్టం కాదు. ఉద్యమం కోసం తమ సంపదలను త్యాగం చేసి, శరణార్థి శిబిరాల్లో తలదాచుకుని, ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్‌ డబ్బులను తిరస్కరించి, నిర్బంధాలను, లాఠీ దెబ్బలను భరించి ముస్లిం మహిళలు ప్రదర్శించిన దేశాభిమానం చరిత్రపుటల్లో స్వర్ణాక్షరాలతో లిఖించదగ్గది. కాని దురదృష్టవశాత్తు నేటి పాపులర్‌ చరిత్ర గ్రంథాల్లో మనకు ఈ జాతిరత్నాల జీవితచరిత్రలు నమోదు చాలా తక్కువగా కన్పిస్తాయి. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలోని ఈ లోటును పూడ్చడానికి బహుగ్రంథకర్త, పాత్రికేయుడు, న్యాయవాది సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ వ్యయప్రయాసలకు ఓర్చి ఈ గ్రంథాన్ని రూపకల్పన చేశారు. ఈ లక్ష్యసాధనలో విజయవంతమైన ఆయన ప్రయత్నం అభినందించదగ్గది.

ఈ పుస్తకంలో మనకు బ్రిటీషు వ్యతిరేక పోరాటాలు చేసిన స్త్రీలు, జాతీయో ద్యమంలో పాల్గొన్న మహిళలు, హైదరాబాద్‌ విలీన పోరాటంలో పాల్గొన్న స్త్రీలు, తెలంగాణా రైతాంగ పోరాటంలో పురుషులతో పాటు సమాన పాత్ర పోషించిన