పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యామం : ముస్లిం మహిళలు

అమర వీరుల రుధిర ధారలకు గుర్తుగా నిలచిన జలియన్‌వాలా బాగ్ గోడ.

వారు సుమారు 1500 వరకు ఉంటారని, మూడు వేలకు పైగా గాయపడిన వారు ఉన్నారని ఆనాటి పలు వ్యక్తిగత, సంస్ధాగత నివేదికలు పేర్కొన్నాయి.

భారత స్వాతత్ర్య్ సమరోజ్వల చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించబడిన జలియన్‌వాలా బాగ్ దుర్మార్గంలో డయ్యర్‌ సైనిక మూకల తుపాకీ గుండ్లకు ఉమర్‌ బీబీ బలయ్యారు. ఆనాటి 55 మంది ముస్లిం యోధులలో ఒకే ఒక మహిళగా 55 సంవత్సరాల ఉమర్‌ బీబీ ప్రత్యేక స్థానం పొందారు.

ఈ మేరకు తన రుధిర ధారలతో జలియన్‌వాలా బాగ్ మట్టిని పునీతం చేయడం మాత్రమే కాకుండ తమ వీరోచిత పోరాటాలతో, ప్రాణ త్యాగాలతో పంజాబీలు నిర్మించిన అద్భుత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఉమర్‌ బీబీ ప్రత్యేక స్థానం పొందారు. (Contribution of Muslims to the Indian Freedom Movement, Khaliq Ahamed Nizami, Idarah-i-adabiyat-i- Delli,1999, Page. 36)

                               * * *

నా భర్తను సింహంలా మృత్యువును స్వీకరించనివ్వండి...జాతి ప్రయోజనాలు, ఆత్మగౌరవాభిమానాల పరిరక్షణ విషయంలో వ్యక్తిగత జీవితాలు అంత ప్రాముఖ్యం కావు..మాతృదేశ విముక్తి పోరాటంలో ధనమాన ప్రాణాలను బలిపెట్టాల్సి ఉంటుంది. ..అందుకు ఎవ్వరూ చింతించాల్సిన అవసరం లేదు సరికదా, మనమంతా మరింతగా గర్వపడాలి. - బేగం ముహమ్మద్‌ ఆలం.

77