పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతత్రోద్యమములో ముస్లిం మహిళలు


==

మీద విరుచుకుపడ్డారు. ఈ వాతావరణం క్రమంగా పంజాబు దాటి దేశవ్యాప్తం కాసాగింది. ప్రజల నుండి వ్యక్తమౌతున్న ఆందోళన, ఆగ్రహాన్ని అణిచివేతకు ఉద్యమిస్తున్న సాయుధ విప్లవకారులను నిరోధించేందుకు, దేశవ్యాప్తంగా వ్యక్తమౌతున్న నిరసన జ్వాలల వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంగ్ల ప్రభుత్వము 1919 మార్చిలో భయంకర రౌలత్‌ చట్టాన్ని తెచ్చింది.

ఈ చట్టం ద్వారా అధికారులకు విశేషాధికారాలు కల్పించింది. పౌర హక్కులను కాలరాయడానికి, విచారణ లేకుండా ఎవరినైనా నిర్బంధించడానికి అవసరానికి మించిన అసాధారణ అధికారాలు పోలీసులకు లభించాయి. ఈ చట్టం క్రింద అనుమానితులు ఎవరినైనా, ఎక్కడైనా పోలీసులు, సైన్యాధికారులు అరెస్టు చేయవచ్చు. ఆ విధంగా అరెస్టు అయిన వారెవ్వరికీ బెయిలు లభించదు. వకీలును నియమించుకునే అవకాశం ఉండదు. తన వాదన విన్పించుకునే అవకాశం ఇవ్వరు. ఆ కారణంగా రౌలత్‌ చట్టం గురించి గాంధీజి వ్యాఖ్యానిస్తూ, నో అప్పీల్‌-నో వకీల్‌-నో దాలాల్‌ (No appeal;no vakeel;no dalaal) అని అన్నారు.

ఈ ప్రజావ్యతిరేక చట్టానికి నిరసనగా సత్యాగ్రహోద్యామానికి గాంధీజీ పిలుపు ఇచ్చారు. ఈ ఉద్యమానికి నాందిగా ఢిల్లీలో తొలి సత్యాగ్రహ సభ జరిగింది. ఆ తరువాత పంజాబులో సభ నిర్వహిచేందుకు డాక్టర్ సైఫుద్దీన్‌ కిచ్లూ తదితర నాయకుల నేతృత్వలో్