పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కదనరంగాన శత్రువును ఎదిరించిన యోధురాలు

బేగం ఉమ్‌ద్దా

(1831- 1857)

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో ఆంగ్లేయ సైనికులతో పోరాడుతూ గాని, శతృ సైనికులను నిలువరించటంలో గాని, తిరుగుబాటు యోధులకు సహాయసహకారాలు అందించటంలో గాని మహిళలు తమదైన పాత్ర నిర్వహించారు. ఆ కారణంగా మొత్తం మీద 255 మంది యువతులు ఉరికంబం ఎక్కారు. ఈ మేరకు Who is who Indian Martyrs, (Dr. PN Chopra,Govt. of India Publications, New Delhi.1973) గ్రంథంలో పేర్న్న మహిళా యోధాులలో అత్యధికులు ముస్లిం మహిళలు ఉండటం విశేషం. అటువంటి విశిష్ట స్థానం పొందిన మహిళలలో బేగం ఉమ్‌ద్దా ఒకరు.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ముజఫర్‌పూరు జిల్లాలోని ఓ గ్రామంలో బేగం ఉమ్‌ద్దా 1931లో జన్మించారు. భయ మంటే ఏమిఒటో ఎరుగని జాట్ కుటుంబానికి చెందిన యువతి ఆమె . ప్రాణాలను పణంగా పెట్టయినా స్వదేశీ పాలనను సాధించుకోవాలన్న ఆత్మాభిమానంతో శత్రువుతో తలబడటంలో ఏమాత్రం వెనుకాడని వారసరత్వం ఆమెది. పరాయిపాలకుల పెత్తనం ఆమెకు నచ్చలేదు. పరాయిపాలకులను పారద్రోలి స్వదేశీయుల పాలనను ప్రతిష్టించుకోవాలన్నది ఆమె కోరిక.

ఆ ఆకాంక్షను సాధించుకునే అవకాశం 1957లో లభించగానే పరాయి పాలకుల పెత్తనానికి చరమగీతం పాడలనుకుంటున్న యోధుల సరసన బేగం ఉమ్‌ద్దా చేరారు. స్వదేశీపాలకుల పక్షాన శతృసైనికులను నిలువరించేందుకు తిరుగుబాటు యోధులతో కలసి బ్రిటిషు సైన్యాలను ఎదాుర్కొన్నారు.

ఆమె పోరుబాటన సాగుతున్న సందర్భంగా ఆంగ్లేయ సైన్యాలు అరెస్టు చేశాయి. ఆంగ్లేయాధికారులు సైనిక విచారణ జరిపి ఆమెకు ఉరిశిక్ష విధించారు. ఆమెతోపాటుగా మరో 11మంది యువతులకు ఆసందర్భంగా ఉరిశిక్ష అమలు చేశారు. ఆ పదకొండు మందితోపాటు బేగం ఉమ్‌ద్దా కూడ మాతృభూమి విముక్తి పోరాటంలో ప్రాణాలను అర్పించారు. 68