పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంగ్ల సైన్యాలను సాయుధంగా నిలువరించిన సాహసి

బేగం జమీలా

(1835 - 1857)

మాతృభూమిని పరాయిపాలకుల నుండి విముక్తం చేసి సొంత గడ్డను స్వదేశీయుల పాలనలో చూడాలన్న ప్రగాఢకాంక్ష కలిగిన యోధులు స్త్రీ-పురుష భేదం లేకుండ ప్రదమ స్వాతంత్య్ర సంగ్రామ బాటను ఎన్నుకున్నారు. ఆ విధగా తిరుగుబాటు యోధులతో కలసి కదనరంగాన ఆంగ్లేయ సైనికులను నిలువరించిన యోధులలో ఒకరు బేగం జమీలా.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ముజఫర్‌పూరు జిల్లాలోని ఓ గ్రామంలో బేగం జమీలా 1935లో జన్మించారు. ఆమె ఆత్మాభిమానానికి మారుపేరైన పరాయి పాలకులకు తలవంచనిఠాను కుటుంబానికి చెందిన యువతి. పరాయిపాలకుల పెత్తనాన్ని ఏమాత్రం సహించని వారసత్వంగల ఆమె ఆంగ్లేయుల అధికారాన్నిఅంగీకరించలేదు. కంపెనీ పాలకులు మాతృభూమిని కబ్జా చేయటం భరించలేకపోయారు.

ఆ సమయంలో 1857 నాి ప్రథమ స్వాతంత్య్రసంగ్రామ నగారా మోగింది. ఆ నగారాతో ఆమెలోని యోధురాలు రణరంగానికి సిద్ధ్దమయ్యారు. మాతృభూమి సేవలో ప్రాణాలను తృణప్రాయంగా భావించిన ఎంతటి త్యాగానికైనా సిధపడి ముందుకు సాగారు. స్వదే శీపాలకుల మీద దాడులు జరుపుతూ తరలివస్తున్నబ్రిటిషు సేనలను నిలువరించడానికి తిరుగుబాటుయోధులతో కలిసి శతృవుపై కలబడ్డారు. ఆ సందర్భంగా ఆంగ్లేయ సైన్యాలు ఆమెను అరెస్టు చేశాయి.బ్రిటిషు సైనిక న్యాయస్థానం విచారణ తంతును పూర్తిచేసి ఆమెకు ఉరిశిక్షను ప్రకటించింది. పుట్టిన గడ్డను పరాయి పాలకుల నుండి విముక్తం చేయటంలో ప్రాణాలను అర్పించి బేగం జమీలా చరితార్థురాలయ్యారు.

(Who is who Indian Martyrs, Dr. PN Chopra, Govt. of India Publications, New Delhi.1973, Page. 64)

67