పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌


అనుసరించారు. ఆ విధంగా ఆమె వెంట నడిచిన దేశభక్తి ప్రపూరితులైన ప్రజలతో ఆంగ్లేయ సైనికుల శిబిరాల మీద దాడులు నిర్వహించారు. ప్రజలలో మాతృదేశ భక్తి భావనలను రచ్చగొట్టి శత్రువుకు వ్యతిరేకంగా ప్రేరేపించి, ప్రజలను తన వెంట తీసుకుని, ప్రళయ భీకరంగా గర్జిస్తూ బ్రిటిష్‌ సైనికుల మీద విరుచుకుపడ్డారు. స్వంత దాళాలతో అకస్మికంగా దర్శనమిచ్చి, అద్భత కౌశల్యంతో కత్తి తిప్పుతూ, గురితప్పకుండ తుపాకి పేల్చుతూ శత్రుమూకలను చీల్చి చెండాడిన ఈమె పలుసార్లు శత్రుస్థావరాల మీద విజయవంతంగా దాడులు నిర్వహించారు. అనుచరులు యుద్ధ్దరంగం వదలి వెళ్ళినా ఆమె మాత్రం చెక్కుచెదరని ధైర్యసాహసాలతో శత్రువును ఎదుర్కొని, శత్రువు కంట పడకుండ చాకచక్యంగా గెరిల్లా పోరు జరిపి తప్పంచుకున్న ఘట్టాలున్నాయి. ఆ విధగా తప్పించుకున్న ఆమె ఎక్కడకు వెడుతుందో, మళ్ళీ ఆమె ఎక్కడ నుండి వస్తుందో, ఎలా వస్తుందో, ఏం చేస్తుందో, ఏలా మాయమøతుందో శత్రుగూఢచారులకు అంతుబట్టలేదు.

ఈ మేరకు బ్రిటిష్‌ సైనికుల మీద, సైనిక స్థావరాల మీద ఆమె చేసిన దాడులు, ఆ దాడుల తీరుతెన్నులను దర్శించిన అదృష్టవంతులు వివరించిన కథనాలు, బ్రిటిష్‌ అధికారులు రాసుకున్న అధికార, అనధికార లేఖలు, ప్రభుత్వ రికార్డులు ఆమె సాహస కృత్యాలను వెల్లడిస్తున్నాయి. ఈ పచ్చదుస్తుల మహిళ సాహసాన్ని ప్రస్తావిస్తూ, ' బేగమత్‌ కి అంశూం ' అను గ్రంథంలో రచయిత పేర్కొనట్లు ' భారత్‌ కే స్వాతంత్య్ర సంగ్రామం మే ముస్లిం మహిళా వోంకా యోగదాన్‌ ' అను పుస్తకంలో రచయిత్రి, అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ అచార్యులు డాక్టర్‌ అబిదా సమీయుద్దీన్‌ (పేజి. 44లో) ఈ విధంగా ఉటంకించారు.

'..ఆ మహిళ అద్వితీయ ధైర్యశాలి. ఆమెకు మృత్యుభయం ఏ మాత్రం లేదు. ఫిరంగులు గర్జిస్తున్నా, తుపాకులు గుండ్లను వర్షిస్తున్నా అత్యంత ధైర్యశాలి అయిన సైనికుడి మల్లే ఆమె తుపాకి గుండ్ల వర్షంలో నింపాదిగా నడిచి వెళ్ళేది. ఆమెను కొన్ని సార్లు నడిచి వస్తుంటే చూశాం. మరికొన్నిసార్లు గుర్రం మీద స్వారి చేస్తూ చూశాం. ఖడ్గవిన్యాసంలో, గురి తప్పకుండ తుపాకి పేల్చటంలో ఆమె మంచి నేర్పరి. ఆమె ధైర్య సాహసాలను చూసి ప్రజలలో ఉత్సాహం ద్విగుణీకృతమయ్యేది..'. ఈ వర్ణన ద్వారా ఆమె గరిల్లా పోరు సాగించేదని మనం అరం చేసుకోవచ్చు. ఆమె ఎక్కడనుంచి వసుందో, ఎక్కడికి వెళ్ళిపోతుందో శత్రువుకు తెలియకుండ దాడులు జరిపిన తీరు ఆమె గెరిల్లా

60