పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాతృదేశ విముక్తి కోసం ఉరిని లెక్క చేయని సాహసి

హబీబా బేగం

(1833-1857)

పుట్టిన గడ్డ గౌరవాన్ని కాపాడుకునేంఫదుకు ఆత్మాభిమానులైన బిడ్డలు ఎంతటి త్యాగాలకైనా సిద్ధాపడతారన్న విషయం స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర నిరూపిస్తుంది. అటువంటి నిరూపణలకు దాష్టాంతరంగా నిలుస్తారు శ్రీమతి హబీబా బేగం.

హబీబా బేగం 1833లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ముజఫర్‌పూర్‌లో జన్మించారు. చిన్నతనం నుండే బానిస భావాలకు వ్యతిరేకంగా పోరాటాలు ప్రారంభించిన హబీబా మనస్సును బ్రిటిషర్ల బానిసత్వంలో మగ్గుతున్నమాతృభూమి దమనీయ స్థితి కలచివేసంది. ఆ వ్యధ నుండి వలస పాలకుల మీద ఆగ్రహం ప్రజ్వరిల్లింది. తెల్లపాలకులను శత్రువులుగా పరిగణంచి, మాతృభూమిని బ్రిటిషర్ల నుండి విముక్తం చేసు కునేందుకు సరైన అదనుకోసం ఎదురు చూడసాగారు.

1857లో ఆమెకు ఆ అవకాశం లభించింది. భారతావనిలోని పలు ప్రాంతాలలో హబీబా లాంటి వీర నారీమణులు, వీర పుత్రులు ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకుల, అధికారుల మీద కత్తులు దూశారు. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న హబీబా తిరుగుబాటు యోధులతో కలసి రణరంగ ప్రవశం చేశారు. సోదర తిరుగుబాటు వీరులతో కలిసి బ్రిటిష్‌ సైనికపాలకుల మీదా తిరగబడ్డారు. ఆ నేరానికి ఆమెను అరెస్టు చేశారు. నాటి దేశభక్తులకు ప్రాణాలు లెక్కలోనివి కావు. మాతృభూమి పరిరక్షణలో ప్రాణాలు విడవడం ఎంతో గర్వంగా భావించారు. హబీబా కూడ ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారు. పరాయి ప్రభుత్వంపై తిరగబడిన నేరానికి 1857లో బ్రిటిషు సైనిక న్యాయస్థానం ఆమెకు ఉరిశిక్షవిధించింది. ప్రథమ స్వాతంత్య్రసంగ్రామ యోధురాలు హబీబా సంతోషంగా ఉరిని స్వీకరించారు. 58