పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం:ముస్లింమహిళలు



వ్యవహరించడాన్ని నమ్మలేకపోయాడు. ఆమె కనుక తన అపరాధాన్ని అంగీకరించి, క్షమాపణ వేడుకుంటే ఆరోణపలన్నీరరద్ధుచేస్తానని, ఆమెను క్షమించి విడిచిపెట్టగలనని హామీ ఇచ్చాడు. ఆ ప్రతిపాదనలను బేగం అజీజున్‌ నిర్ద్వందంగా నిరాకరించారు. ప్రాణ భయం ఏమాత్రంలేని ఆమె ప్రవర్తన చూసి విస్తుపోయిన ఆ అధికారి , ' నీకేం కావాలి? ' అని ప్రశ్నించాడు. నాకు ' బ్రిటిష్‌ పాలన అంతం చూడాలనుంది ',('I want to see the end of the British rule ', - ibid page. 586), అని ఆమె నిర్బయంగా, చాలా ఘాటుగా సమాధానమిచ్చారు. అ సమాధానంతో ఆగ్రహించిన General Havelock ఆమెను కాల్చివేయాల్సిందిగా సైనికులకు ఆదేశాలిచ్చాడు.

ఆ ఆదేశాలను విన్నఅజీజున్‌ చిరునవ్వు చిందిస్తూ తుపాకి గుండకు ఎదురుగా నిలబడ్డారు. బ్రిటిష్‌ సైనికుల తుపాకులు ఒక్కసారిగా గర్జించాయి. ఆ తుపాకుల్లో నుండి గుళ్ళ బయల్పడి ఆమె సుకుమార శరీరాన్నిఛేదించుకుని దూసుకపోతుండగానే నానా సాహెబ్‌ జిందాబాద్‌ అంటూ ఆ అసమాన పోరాటయోధురాలు నినదించారు. ఆ సింహనాదాంతో ఆంగ్లేయ సైనికులు ఒక్కక్షణం స్థంభించి పోయారు. మహాయోధ బేగం అజీజున్‌ ప్రాణాలు అనంతవాయువులలో కలిసిపోయాయి.

ఆ మహత్తర త్యాగమూర్తికి చరిత్రలో తగినంత స్థానం లభించలేదు. ఆ యోధురాలి గత జీవితాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని కించపర్చే విధంగా బ్రిటిషు చరిత్రకారులు, బ్రిటిషు సామ్రాజ్యవాదుల ఏజెంట్లు ఆమె గురించి అవాకులు చవాకులు రాశారు. నిజానికి ఆమె ప్రేమను బజారులో అమ్ముకొనలేదు . స్వతంత్ర సమర రంగంలో దేశబక్తికి కానుకగా అర్పించింది. (1857 స్వరాజ్య సంగ్రామం, సావర్కార్‌, పేజి.88) ఆ తరువాత జరిగిన పరిశోధనలు బ్రిటిషర్ల కుట్రలను బయట పెడుతూ, అజీజున్‌ త్యాగమయ చరిత్రను వెలుగులోకి తెచ్చాయి. ఆనాటి అసత్యాలను, అభూత కల్పనలను బట్టబయలు చేశాయి. ఈ మేరకు సాగిన కృషి ఫలితంగా ఆ నాటి కుట్రల కారుమబ్బులను చీల్చుకుంటూ మధ్యాహ్నం మార్తాండుడిలా ఆమె సాహసోపేత చరిత్ర వెలుగులు చిమ్మడంతో బేగం అజీజున్‌ ఉత్తమ చరిత్ర ప్రపంచానికి వెల్లడయ్యింది.

57