పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


పలు సైనిక చిహ్నాలను అలంకరించుకుని, తుపాకి ఒకవైపు, ఖడ్గం మరోవైపున ధరించి కవాతులలో పాల్గొనటం ఆమెకు అలవాటు. ఆమె నేతృత్వంలో కవాతు సాగుతున్న బజార్లలో ప్రజలు బారులు తీరి నిలబడి ఆమె రాకకోసం ఎదురు చూసూ, నానాసాహెబ్‌ జిందాబాద్‌-బేగం అజీజున్‌ జిందాబాద్‌ ' అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలను చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసేవారు. ఈ విషయం 1857 న్‌ 16న నానక్‌ చంద్‌ అను వ్యక్తి తన డైరీలో రాసిన సమాచారాన్ని బట్టి వెల్లడవుతుంది. ఆమె కృషి, నిస్వార్థ సేవాతత్పరత, కార్యదీక్ష్తత, ప్రగతిశీల ఆలోచనలను, నానా సాహెబ్‌ పట్ల చూపుతున్న విధేయతను గమనించి నానాకు కుడి భుజంగా ఖ్యాతి చెందిన ప్రముఖ స్వాతంత్య్రసమరయోధులు, నానా సాహెబ్‌ ప్రధాన సహచరులు అజీముల్లా ఖాన్‌ ఆమె సేవలను ఎంతగానో ప్రశంసించారని ఆనాటి ప్రముఖ వ్యాపారి నానక్‌ చంద్‌ తన దాస్తావేజులలలో రాసుకున్నాడు. (Encyclopaedia of Muslim Biography, Vol.I, Ed. by Nagendra Kr. Singh, APH, 2001, page. 585)

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం అంతమైన తరువాత ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారులు తిరుగుబాటులో పాల్గొన్న సంస్థానాధీశులు, సైనికాధికారులు, ప్రజల మీద భయంకరంగా విరుచుకుపడ్డారు . ఆ సమయంలో ఆంగ్లేయాధికారిCol.William తయారు చేసిన కాన్పూరు తిరుగుబాటుదారుల జాబితాలో అజీజున్‌ మొదటి స్థానంలో ఉన్నారు. ఆమెకు వ్యతిరేకంగా కాన్పూరుకు చెందిన ప్రముఖ వ్యాపారి జానకీ ప్రసాద్‌ సాక్ష్యం పలుకుతూ, ఆమె సదా సైనికాధికారి దాుస్తులలో ఉంటూ, నానా సాహెబ్‌ కోసం ఆమె మహిళా దాళాలు పనిచేశాయి. ఆమెకు పీష్వాసైనిక దాళాలతో ప్రత్యక్షసంబంధాలున్నాయి. తిరుగుబాటు పతాకం ఎగరగానే ఆమె తిరుగుబాటు యోధాులతో కలసి పోరుబాటన నడిచారని, ఆంగ్లేయ న్యాయస్థానంలో వివరించాడు. ఈ మేరకు ఆమె తిరుగుబాటు యోధులతో కలసి పనిచేసిందని బ్రిటిషు అధికారుల విచారణలో పలువురు వ్యక్తులు సాక్ష్యం చెప్పారు. (Encyclopaedia of Muslim Biography, Vol.I, page. 585)

ఈ విచారణలో భాగంగా, బేగం అజీజున్‌ను ఉన్నత సైనికాధికారి General Havelock ఎదుట హాజరు పర్చారు. ఆమె సాహసకృత్యాల గురించి విన్న ఆ అధికారి, ఆమె రూపురఖలను చూసి ఆశ్చర్యపోయాడు. మగదుస్తుల నుండి ఆమె బయట పడగానే ఆమె అందాచందాలను చూసి అవాక్కయ్యాడు. ఆమె రణరంగంలో అరివీర భయంకరంగా


56