పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం:ముస్లింమహిళలు


తమ ప్రాణాలను పణంగా పెడతామని శపధాలు చేయించి, శత్రువును దునుమాడేందుకు, ఏ క్షణాన్నైనా రణరంగ ప్రవేశం చేయడానికి బలగాలను సిద్ధంగా ఉంచారు. ఈ మేరకు మహిళా సెనిక దాళాన్ని స్థాపించిన ప్రప్రదమ మహిళగా అజీజున్‌ను అభివర్ణిసూ, ప్రముఖ రచయిత ఆనంద స్వరూప్‌ మిశ్రా ఉత్తర ప్రదశ్‌ ప్రబుత్వం ప్రచురించిన "Nana Saheb Peshwa and the War in Independence" అను గ్రంథంలో పేర్కొన్నారు. అజీజున్‌ సమర్థవంతమైన నాయకత్వంలో మహిళా సైనిక దాళాలు పలు కార్యక్రమాల భారాన్ని స్వీకరించి నానా సాహెబ్‌ పోరాటానికి ఎంతగానో తోడ్పడ్డాయి. ఆమె తన బలగంతో నగరంలోని ప్రతి ఇల్లూ తిరుగుతూ, ' మీ లాంటి యువకుల్లో రక్తం చల్లబడిపోయింది. మీలో పౌరుషం చచ్చిపోయిందా? మీ రకం ప్రతీకార జ్వాలతో వేడెక్కుతుందా? లేదా? మన మోచేతి నీళ్ళు తాగే కుక్కలు మనపై పెత్తనం చలాయిస్తున్నారు. దానిని మనం మౌనంగా భరిస్తున్నాం. మన వీరత్వం, శౌర్య పరాక్రమాలు ఏమైపోయాయి? అని ప్రశ్నిస్తూ యువకుల్లో రోషాగ్నిని ప్రజ్వరిల్లచేశారు. (అజ్ఞాత వీర గాథలు, గోవిందస్వరూప్‌ సింహాల్‌, భారత ప్రబుత్వ ప్రచురణలు, న్యూఢలీ, 1999, పేజి. 30-31)

యుద్ధ భయంతో సైన్యంలో చేర నిరాకరించిన పురుషుల చేతులకు స్వయంగా గాజులు తొడిగి, వారిలో రోషం రగిలించి తిరుగుబాటు సైనిక బలగాలను బాగా పెంచగలిగారు. స్వాతంత్య్ర సమరయాధులకు ఆహారం, ఆయుధాలను సమకూర్చి పెట్టడం, నాయకులు, సెనికుల మధ్యా న సంధానకరల్లా వ్యవహరించటం, బ్రిటిష్‌ సైనికుల కదలికలు గమనించి ఆ సమాచారాన్ని తిరుగుబాటు దాళాల నాయకులకు చేరవేయటం తదితర బాధ్య తలను ఆమె నిర్వహించారు. దాళ సబ్యులతో ఇల్లిల్లు తిరిగి బట్టలు, ఆహార పదార్థాలను సేకరించి తిరుగుబాటు యోధుల అవసరాలను తీర్చుతూ వారికి ఎటువంటి లోటు కలుగనివ్వకుండ జాగ్రతలు తీసుకున్నారు. ప్రదానంగా రణరంగంలో గాయపడన స్వదేశీ సైనికుల చికిత్సకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించటం పట్ల ఆమె శ్రద్ధను చూపారు. ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వీరులు గాయపడి అనాధలుగా ప్రాణాలు విడవటం పట్ల కలతచెందిన ఆమె క్షతగాత్రులకు ప్రత్యేక శ్రద్ధతో సేవలందించారు. అజీజున్‌ తరుచుగా తన మహిళా సైనిక బలగాలతో కాన్పూరు పురవీధుల్లో కవాతు చేసి ప్రజలను ఉత్సాహపర్చేందుకు కృషి సల్పారు. సంపూర్ణ సైనికాధికారి దుస్తులతో,


55