పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


పరాయి పాలకులైన ఆంగ్లేయులంటే ఆమెకు విపరీతమైన ద్వెషం. బ్రిటిషు సైన్యంలో సుబేదారుగా పనిచేస్తూన్న షంషుద్దీన్‌ అను సాహసి ఆమెను ప్రేమించాడు. ఆయన బ్రిటిషు సెన్యం నుండి తొలిగి ప్రముఖ స్వాతంత్య్రసమరయోధుడు నానా సాహెబ్‌ కొలువులో చేరేంతవరకు అతని ప్రేమను ఆమె అంగీకరించలేదు. ఆమె హృదయం షంషుద్దీన్‌ కోసం ఎంతగా తపంచిపోయేదో, భారత స్వాతంత్య్రము కోసం కూడ అంతగా తపంచిపోయేది. (1857స్వరాజ్య సంగ్రామం, సావర్కార్‌, నవయుగబారతి, హెదారాబాద్‌, 2001, పేజి. 88)

కాన్పూరు పాలకుడు నానా సాహెబ్‌ పీష్వా అంటే అజీజున్‌కు అమిత భక్తి- గౌరవం. స్వదేశీ సంస్థానాలను అక్రమంగా ఆక్రమించుకుంటున్న కంపెనీ అధికారులంటే అసహ్యం. పరదేశీయులు సాగిస్తున్న అధర్మాన్ని,అన్యాయాన్నిఎదుర్కొవాలని ఆమె ప్రగాఢంగా వాంఛించారు. ఆ కోర్కె బలపడే కొద్ది, సారంగి మహల్‌ లోని సంగీత నృత్య వినోదాలను, త్యజించి, విలాస జీవితాన్ని వదిలి, నానా సాహెబ్‌ పక్షాన నిలిచి, బ్రిటిషర్ల దాష్టీకాలకు అడ్డుకట్టవేయాలని భావించారు.

ఆ అవకాశం 1857లో ఆమెకు లభించింది. 1857 జూన్‌ 4న కాన్పూరులో తిరుగుబాటు ఆరంభవుంది. నానాసాహెబ్‌ బ్రిటిషర్ల మీద జూన్‌ 7న సమరశంఖారావం పూరించారు. హిందూ-ముస్లింలను తేఫడా లేకుండ ధర్మాన్ని, దేశాన్ని రక్ల్షించుకునేందుకు కాన్పూరు ప్రజలంతా ఆయుధాలు చేపట్టాల్సిందిగా ఆయన హిందీ-ఉర్దూ భాషలలో పిలుపునిచ్చారు. ఆ పిలుపునందుకున్న అజీజున్‌ సుకుమార, సౌకర్యవంత, సుఖమయ జీవితాన్ని వదిలి, పరాయి పాలకుల మీద యుద్ధం చేసేందుకు నానా సాహెబ్‌ పక్షంలో చేరారు.

సహచరు డు షంషుద్దీన్‌ సహకారంతో అజీజున్‌ ఆయుధాలు ఉపయాగించటం, గుర్రపు స్వారి నేర్చుకున్నారు. ఆమె సైనిక దుస్తులులు ధరించి రణరంగానికి సిద్ధమయ్యారు. మాతృదేశ భక్తిభావనలు గల యువతులను సమీకరించి, ప్రత్యేక మహిళా సైనిక దళం ఏర్పాటు చేశారు. మహిళా సైనిక దళం ఏర్పాటు చేయ టమే కాకుండ, వారికి స్వయంగా చక్క ని శిక్షణ గరిపి, ఎటువంటి ఉపద్రవాన్నై నా ఎదుర్కోగలిగట్టుగా ఆ దాళాలనుతీర్చిదిద్దారు. తుపాకి పేల్చటం, కత్తి తిప్పటం, గుర్రపుస్వారి చేయటంలో ప్రత్యేక శిక్షణ కల్పించి సుశిక్షితులైన సైనికులుగా తయారు చేశారు. ప్రజల రక్షణతోపాటు, రాజ్యరక్షణ కోసం 54