పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


లభించక పోగా నేపాల్‌ అడవులు వదిలి వెళ్ళిపోవాల్సిందిగా అతను ఆదేశించాడు. అనివార్యపరిస్థితు లలో ప్రమాదాకర వాతావరణాన్నిఎదుర్కొంటూ బేగం హజరత్‌ మహాల్‌, బిర్జిస్‌ ఖధిర్‌ నేపాల్‌ అడవుల్లో సంచరించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఒక వేళ పోరాడి నేలకొరిగే అవకాశం తనకు లభించకుంటే అత్మార్పణ చేసుకునేందుకు బేగం ఎల్లప్పుడు విషంతో కూడిన పాత్రను తనవెంట ఉంచుకుని ఆంగ్లేయుల మీద పోరాటం సాగించేందుకు ప్రయత్నాలను సాగించారు.

ఆ సమయంలో నేపాల్‌ అడవుల్లోకి బేగం హజరత్‌ మహాల్‌ ఛాయా చిత్రం గీసేందుకు వచ్చిన ఒక బ్రిటిష్‌ చిత్రకారుని ద్వారా, వ్యక్తిగతంగా ఆమెకు ఏడాదికి లక్ష రూపాయలు ఆమె కుమారుడు బిర్జిస్‌ ఖదీర్‌కు 15 లక్షలు అందచేస్తామని ఆశ చూపుతూ బ్రిటిష్‌ పాలకులు, బేగంను లొంగదీసుకునేందుకు విఫల ప్రయత్నం చేశారు. ఈ విధంగా ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ సాగుతుండగా, ఆమె వెంట వచ్చిన యోధులు ఒక్కొక్కరే ఆ కారడవుల్లో, మంచు కొండల్లో మృత్యువువాత పడసాగారు. కాలం గడచేకొద్ సంపదతోపాటుగా, సహచరులు తరిగి పోసాగారు.

ఆ పరిస్థితులలో కూడ శత్రువుకు ఏమాత్రం తలవంచడానికి బేగం ఇష్టపడలేదు. ప్రధాన సహచరులు, అనుంగు అనుచరులు మృత్యువాతపడి అదాశ్యమైపోయారు. ఆ సమయంలో ఒంటరిగా మిగిలిన ఆ అసమాన పోరాటయోధురాలు, అతి నిస్సహాయ పరిస్థితులలో సామాన్య జీవితం గడపసాగారు. చివరకు ఆ మంచు కొండల శిఖరాల మీద రెపరెపలాడుతున్న అవధ్‌ రాజ్యం ఛత్ర ఛాయలో 1874 ఏప్రిల్‌ మాసంలో బేగం హజరత్‌ మహాల్‌ కన్నుమూశారు.

ఆమె బౌతికకాయాన్నిఖాట్మండులో ఆమె స్వయంగా హిందూస్థానీ మసీదులో ఓ ప్రక్కన ఖననం చేశారు. ప్రస్తుతం ఆ ఇమాంబారా శిథిలమైపోయింది. అక్కడ హజరత్‌ మహాల్‌ స్మృతి చిహ్నంగా ఆమె సమాధి మాత్రమే మిగిలింది. అది కూడ ఆక్రమణలకు గురవుతుంది. ఆ సమాధి నూటపాతికేళ్ళుగా అక్కడ ఉన్నా దానిని పట్టించుకున్న వారు లేకపోయారు. 1957లో ప్రథమ స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్బంగా, బేగం హజరత్‌ మహాల్‌ సమాధికి ఏర్పడిన దుస్థితి గురించి ఆమె వంశజుడు మీర్జా ఆజం ఖదీర్‌ ఆనాటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్‌ నెహ్రూ ను కలసి ఓ మహాజరు ద్వారా అక్కడున్నపరిస్థితిని ఆయన దాష్టికి తెచ్చారు. 50