పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం:ముస్లింమహిళలు


( '.. no one has ever seen in a dream that the English forgave an offence ..' -Encyclopaedia of Women Biography Vo. II, Ed. by Nagendra.K.Singh, APH Publishing Corporation, New Delhi, 2001, Page. 66) ఆంగేయులు స్వదేశీయుల ఆత్మాభిమానాన్ని ఏవిధగా దెబ్బగొట్టిందీ, స్వదేశీయుల మతధర్మాలను ఏవిధంగా కించపర్చిందీ, మత మనోభావాలను ఏ విధంగా అవమాన పర్చిందీ, తిరుగుబాటుకు భయపడి తిరగబడ్డ సైనికులను, నేతలను మాలిమి చేసుకునేందుకు ఎలాంటి ఆశలు చూపిందీ, గతంలో స్వదేశీ పాలకుల మీద ఎంతటి అఘాయిత్యాలకు పాల్పడిందీ ఆ సుదీర్ఘ…మైన చారిత్రాత్మక ప్రకటన సాక్ష్యాధారాలతో సహా వివరించింది. చివరకు మా ప్రజలు మాదేశాన్నికోరుతున్నప్పుడు ఆమె మాదేశాన్ని మాకెందుకు వదాలిపెట్టదూ? ( '..Why does her Majesty not restore our country to us. when our people want it..' - Encyclopaedia of Women Biography Vol. II, Page.66) అని సూటిగా విక్టోరియా రాణిని ప్రశ్నించారు. విక్టోరియా రాణి మభ్యపెట్టు మాటలను నమ్మవద్దని, మోసపోవద్దని ప్రజలకు, స్వదేశీ పాలకులకు ఆమె విజ్ఞప్తి చేశారు. మాతృభూమి నుండి పరాయిపాలకుల పెతనాన్ని రూపుమాపేందుకు కంకణబద్ధులై అంతా కదలాలని ఆమె ప్రజలను కోరారు.

ఈ పరిస్థితులు ఇలా ఉండగా, ఆంగ్లేయాధికారులు లక్నో తిరుగుబాటును క్రూరంగా అణిచివేయడానికి, తిరుగుబాటు నాయకులను తుదాముట్టించేందుకు పదకాలు రూపొందించసాగారు. అన్ని వెపు ల నుండి తిరుగుబాటు సైన్యాలను తరు ముతూ, వారంతా నేపాల్‌ దిశగా సాగిపోయేందుకు పథకం ప్రకారంగా అనుకూలతను సృష్టించారు. లక్నో నుండి తప్పుకున్న తరువాత బేగం హజరత్‌ మహాల్‌ కూడ మిగతా యోధులతో పాటుగా మరో మార్గం లేక నేపాల్‌ దిశగా సాగాల్సివచ్చింది. ఆ నిర్ణయం వలన ఆమె రక్షణ కూడ ప్రమాదంలో పడింది. బ్రతికుండగా తాను గాని, మరణించాక తన శవం గాని ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకుల చేతుల్లో పడరాదని నిర్ణయించుకున్న ఆమె నానా సాహెబ్‌ ఇతర తిరుగుబాటు నేతలతో కలిసి నేపాల్‌ అడవుల్లోకి వెళ్ళిపోయారు.

అక్కడ కూడ ఆమెకు ప్రమాదం తప్పలేదు. ప్రమాదాల నుండి తప్పంచుకుంటూ రాత్రి పగలు అని తేడ లేకుండా ఆమె గడపాల్సి వచ్చింది. చివరకు నేపాల్‌ రాజ్యం లోనికి ప్రవేశించిన ఆమెకు నేపాల్‌ పాలకుడు జంగ్ బహుద్ధూర్ నుండి సహకారం 49