పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌నశీర్‌అహమ్మద్‌


తదితరుల పరాజయాలు బేగంను బాగా కృంగదీశాయి. ఈ వాతావరణంలో బేగం తన పరివారం తోపాటుగా అక్కడ కొన్నాళ్ళు, ఇక్కడ కొన్నాళ్ళు తలదాచుకుంటూ గడపసాగారు. బేగం పరివారాన్ని వెంటాడుతున్న కంపెనీ బలగాలు ఆమె తలదాచుకున్న చోటల్లా ప్రవేశించి కసికొద్ది బీభత్సం సృష్టించసాగాయి. ఆమెను ఆమె బలగాలను నీడలా వెన్నంటి కంపెనీ సైనికులు వస్తున్నా ప్రజల అండదండలతో, అత్యంత విశ్వాసపాత్రులైన సైనికాధికారు, సైనికుల రక్షణలో ఆమె ప్రమాదాన్నిఅధిగమిస్తూ సురక్షితంగా సంచరించసాగారు.

బేగం హజరత్‌ మహల్‌ ప్రవాసంలో ఉన్నప్పుడు 1858 నవంబర్‌ 1న విక్టోరియా మహారాణి ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలనను రద్దుచేసి, పాలనాధికారాన్నిస్వయంగా స్వీకరించింది. ఈ సందర్బంగా విక్టోరియా రాణి ప్రకటన గా ఖ్యాతి గాంచిన ప్రకటనను ఆమె చేసింది. అందులో స్వదేశీ పాలకులకు, ప్రజలకు ఆమె పలు హామీలు కుమ్మరించింది. పలు ఆకర్షణీయమైన ఆశలను చూపింది. తిరుగుబాటు వీరులకు, నేతలకు కమాబిక్ష ప్రసాదిస్తానంది. తిరుగుబాటులో పాల్గొన్న స్వదేశీ పాలకులను, ప్రజలను ఆ ప్రకటన కొంతలో కొంతగా ఆకర్షించింది. విక్టోరియా రాణి ప్రసాదించే క∆మాబిక∆తో బ్రతికి బయటపడి తమ ప్రాణాలు కాపాడుకోవాలనుకున్న కొందరు సహచరులు, పాలకులు, జమీందారులు, అధికారులు తిన్నగా బేగం పక్షం నుండి తప్పుకోసాగారు. ఈ పరిణామాలు ఆమెను మరింత కలవరపరిచాయి.

ఆ పరిసితులలో ప్రజలలో, సహచరులలో ఆత్మవిశ్వాసం కలిగించేందుకు, బేగం హజరత్‌ మహాల్‌ విక్టోరియా ప్రకటనకు దీటుగా 1858 డిసెంబర్‌ 31న మరో చారిత్రాత్మక ప్రకటనను బిర్జిస్‌ ఖదీర్‌ పేరిట విడుదల చేశారు. ఆ ప్రకటనలో సామ్రాజ్యవాద కాంక్ష కలిగిన ఆంగ్లేయులు ఇండియాలోని స్వదేశీ సంస్థానాలను ఎలా ఆక్రమించుకుందీ, స్వదేశీ పాలకులను ఎలా మోసగించిందీ, స్వదేశీ పాలకులతో పలు ఒప్పందాలు చేసు కుని వాిని నిస్సిగ్గుగా ఎలా ఉల్లంఫిుంచిందీ, ప్రజల మత విశ్వాసాల మీద, ఆచార సంప్రదాయాల మీద ఎటువంటి దాడులు నిర్వహిస్తున్నదీ సవివరంగా పేర్కొన్నారు. స్వదేశీ పాలకుల మీద ఎంతటి దారుణాలకు ఒడిగట్టిందీ ఆ ప్రకటనలో వివరించారు. ఆంగ్లేయులు అపరాధాన్నిక్షమించినట్టు కలలో కూడ ఎవ్వరూ చూడలేదు అంటూ ఆనాడు లొంగుబాటుకు సిద్ధ్దమవుతున్నయోధులను బేగం హెచ్చరించారు. 48